ముంద‌స్తు లేదు.. కానీ.. ఈ సంద‌డి త‌ప్ప‌ట్లేదు.. !

Update: 2022-12-17 14:30 GMT
ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఉన్నాయా? అంటే.. లేవనే చెబుతున్నారు వైసీపీ నాయ‌కులు. కానీ, ముంద స్తును మించిన ముచ్చ‌ట్లు మాత్రం జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం అప్పుడే వ‌చ్చేసిందా? అన్న రేంజ్‌లో రాష్ట్రంలో రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఒక్క వైసీపీ అనేకాదు.. ఈ పార్టీ చూసపుతున్న దూకుడుతో ఇత‌ర పార్టీలు కూడా.. వ్యూహాల‌కు ప‌దును పెట్టాయి. పార్టీ ప‌రంగా నాయ‌కుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నాయి.

ఇదేవిష‌యం అన్ని పార్టీల‌లోనూ చ‌ర్చ‌గా మారింది. గ‌తంలో చూసుకుంటే.. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల  ముందు మాత్ర‌మే టీడీపీలో సంద‌డి క‌నిపించేది. గెలుపుగుర్రాల వేట సాగేది. అదేస‌మ‌యంలో నాయ‌కు ల‌ను అదిలించ‌డం..క‌దిలించ‌డం కూడా ఆరు మాసాల ముందే సాగేది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే త‌మ్ముళ్ల‌ను హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని తేల్చి చెబుతున్నారు.

లేక‌పోతే టికెట్లుఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కూడా తేల్చి చెబుతున్నారు. అయితే, కొంద‌రు క‌ద‌లుతున్నారు. మ‌రికొంద‌రు చూద్దాంలే! అని వాయిదా వేస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన‌లో నాయ‌కులు లేరు కాబ‌ట్టి అధినేత జ‌న‌సేనాని ప‌వ‌న్ స్వ‌యంగా వారాహి వాహ‌నాన్ని సిద్ధం చేసుకుని ఎన్నికల ప్ర‌చారానికి ముందుకు దూకుతున్నారు. నిజానికి ఇప్పుడు ప్ర‌చారం మొద‌లు పెట్ట‌డం వ‌ల్ల ఆయా పార్టీల‌కు ఎంత మేలు క‌లుగుతుందో తెలియ‌దు కానీ, రాష్ట్రంలో మాత్రం రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింద‌నే చెప్పాలి.

మ‌రో వైపు ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర గంద‌ర గోళ ప‌రిస్థితి నెల‌కొంది. అస‌లు ఎవ‌రు చెప్పేది నిజం.. ఎవ‌రు త‌మ‌కు అనుకూలం.. అనే చ‌ర్చ సాగుతోంది. అదే ఎన్నిక‌ల‌కు ముందు అయితే.. భావోద్రేక‌మో.. లేక పార్టీల‌పై ఉన్న సానుకూల దృక్ఫ‌థంతోనో ఓటెత్తే ప‌రిస్థితి ఉండేది.

కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. అన్ని పార్టీలు ముందుగానే ప్ర‌చారం ప్రారంభించి..  త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నా..ప్ర‌జ‌లు మాత్రం గంద‌ర‌గోళంలో ఉన్నారు. వైసీపీని కాదంటే పింఛ‌న్లు పోతాయ‌నే బెంగ మ‌రింత గా ఉండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News