ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కోపం ప‌ట్ట‌లేక‌పోతున్నారా... !

Update: 2022-12-30 04:59 GMT
వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం జ‌గ‌న్ ను మిన‌హాయిస్తే.. మిగిలిన వారిలో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ప‌ద‌వులు ద‌క్కాయి. దీంతో వారి విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. చాలా మంది మాత్రం ఆట‌లో అర‌టిపండు మాదిరిగా త‌యార‌య్యారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వీరిలో కొంద‌రు త‌మ‌ను తాము అలెర్ట్ చేసుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అంటే.. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల కారణంగా.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఇంటిప‌న్నులు పెంచ‌డం, పెట్రోల్‌పై ట్యాక్సులు త‌గ్గించ‌క‌పోవ‌డం, చెత్తపై ప‌న్నులు విధించ‌డం.. పింఛ‌న్ల తొల‌గింపు , జ‌గ‌న‌న్న ఇళ్ల ల‌బ్ధి దారుల‌కు ఇంకా ఎలాంటి స‌దుపాయాలు క‌ల్పించ‌క పోవ‌డం.. ఇలా అనేక కార‌ణాలు వ్య‌క్తిగ‌తంగా కుటుంబాల‌ను బాధిస్తున్నాయి.

ఇక‌, సామాజిక అంశాల‌ను చూస్తే.. అభివృద్ధి లేదు. ర‌హ‌దారుల నిర్మాణం అస‌లే లేదు. ఇక‌, నిరుద్యోగంపై ప్ర‌భుత్వం చాలా ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త పెరిగిపో యింది. దీంతో సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సెగ త‌గులుతోంది. అయినా కూడా ఏదోర‌కంగా గెలుస్తామ‌నే ధీమా కొంద‌రిలో ఉంది.

కానీ, మ‌రికొంద‌రు మాత్రం.. ఈధీమాను కోల్పోతున్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌తో పెరుగుతున్న వ్య‌తిరేక‌త త‌మ కొంప ఎక్క‌డ ముంచుతుందోన‌ని బాధ‌ప‌డుతున్న‌వారంతా.. కూడా.. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వంపై అంటే.. సొంత ప్ర‌భుత్వంపై వారు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు

ఇలాంటివారిలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, న‌ల్ల‌ప రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌, పిఠాపురం ఎమ్మెల్యే కొండేటి బుచ్చిబాబు వంటివారు దూకుడుగా ఉన్నారు. దీనికి రీజ‌న్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీపై ఉన్న కోపం త‌మ‌పై చూపించ‌కుండా ముందు జాగ్ర‌త్త ప‌డ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్కువ‌ట్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News