టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవులు దక్కేది వీరికేనా..?

Update: 2021-11-05 06:54 GMT
మొన్నటి వరకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్న టీఆర్ఎస్ ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల కాగా ఆ స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఆరు స్థానాలు టీఆర్ఎస్ కు దక్కేవే. దీంతో పార్టీలోని ఆశావహులు ఇప్పటికే తమ దగ్గరినేతలతో పైరవీలు సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఎమ్మెల్సీ స్థానాలకు పోటా పోటీ నెలకొంది. ఈ జిల్లాలోని గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరి గడువు తీరిపోనుంది. దీంతో వీరి స్థానాలను దక్కించుకునేందుకు కొందరు నాయకులు హైదరాబాద్ బాట పడుతున్నారు.

నాగార్జున సాగ్ ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడ పర్యటించినప్పుడు కొందరు ఆశావహులకు ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చేందుకు హామీ ఇచ్చారట. వారిలో కోటి రెడ్డి ఉన్నారు. దీంతో కోటిరెడ్డి ఇక తమకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు అధినేతను కలిసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్లు మరోసారి తమకే అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన స్థానాన్ని మార్చే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. అయితే నేతి విద్యాసాగర్ సైతం మరోసారి తనకే దక్కేలా రకరకాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే నాగార్జున సాగర్ లో నోముల నర్సింహ్మయ్య మరణం తరువాత అక్కడి టికెట్ తమకే ఇవ్వాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. కొందరు బీజేపీ నాయులు సైతం పార్టీలో చేసి టికెట్ కోసం అడిగారు. కానీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా నోముల నర్సింహ్మయ్య కుమారుడు నోముల భగత్ కే టికెట్ కేటాయించారు. అయితే ఇక్కడ గెలిచే అవకాశం ఉండడంతో ఆశావహులకు తరువాత మంచి అవకాశం ఉంటుందని కేసీఆర హామీ ఇచ్చారు. అంతేకాకుండా కోటి రెడ్డి నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. తాజా షెడ్యూల్ ప్రకటనతో ఆయనలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే కేసీఆర్ హామీ ప్రకారంగా కోటిరెడ్డికి ఇస్తారా..? లేక మరోసారి ఇప్పుడున్నవారికే అవకాశం ఇస్తరా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే రాష్ట్రంలో టీర్ఎస్ పై ప్రజల్లోనూ.. పార్టీలోని నాయకుల్లోనూ వ్యతిరేకత వస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నా తమకు ఎలాంటి అవకాశం రానివాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇటీవల స్థానిక కమిటీలు నియమిస్తామని పార్టీ ప్రకటించింది. కానీ ఆ వ్యవహారం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నాయకుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో అవకాశం వచ్చిన దానిని వినియోగించుకోవాలని చూస్తున్నారు. అయితే ఉన్నవారినే తిరిగి మళ్లీ నియమిస్తే ఇక ఇతర పార్టీలను చూసుకోవడమే బెటరని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ మెల్లగా పుంజుకుంటున్నాయి. టీఆర్ఎస్లో న్యాయం జరగకపోతే ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ ఇటీవల ఓ ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. టీఆర్ఎస్లో ఇప్పుడున్న వారికే టికెట్ అని కేసీఆర్ ప్రకటన చేస్తే మాత్రం చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో తాజాగా ఎమ్మెల్సీ విషయంలో కూడా కొందరు నాయకులు అవకాశం రాకపోతే కాంగ్రెస్, బీజేపీ వైపు నడిచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే కేసీఆర్ ఆశావహులకు ఎలా సంతృప్తి పరుస్తారోనని పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News