ముచ్చటగా మూడోసారి గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకొని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని సిద్దం చేసేందుకు పీకే టీం కిందా మీదా పడుతూ పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ కు అధికారాన్ని రాకుండా చేసే అవకాశం ఉన్న టాప్ 30 మంది ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేయటమే కాదు.. వారు చేసిన తప్పులు.. వారికి ప్రజల్లో ఉన్న పలుకుబడితో పాటు వారు చేసిన తప్పుల చిట్టాను నివేదిక రూపంలో సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గులాబీ బాస్ ఎత్తులతో ఇప్పుడా పార్టీకి అసెంబ్లీలో దాదాపు వంద వరకు ఎమ్మెల్యేల బలం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటం.. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సిట్టింగుల విషయంలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటూ కేసీఆర్ నిర్మోహమాటంగా చెప్పటం తెలిసిందే.
అయితే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ టోన్ మారిపోయింది. సిట్టింగులు అందరికి టికెట్లు ఇస్తామని.. జాగ్రత్తగా పని చేసుకోవాలని చెప్పటం తెలిసిందే. కొద్ది మంది మీద వ్యతిరేకత ఉందని.. వారు మినహా మిగిలిన వారికి టికెట్లు ఖాయమన్న మాట కేసీఆర్ నోటి నుంచి రావటం విన్నదే. అయితే.. కేసీఆర్ చెప్పిన మాటలకు వాస్తవానికి పోలిక లేదన్న మాట వినిపిస్తోంది. కారణం.. పీకే టీం చేసిన కసరత్తు ప్రకారం చూస్తే.. సిట్టింగుల్లో దాదాపు 30 మందికి పైనే నెగిటివ్ రిపోర్టు ఉందని.. వారికి టికెట్లు ఇస్తే పార్టీ మునిగిపోవటమే కాదు.. మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆశయం కూడా నెరవేరదన్న మాట వినిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సీటు కీలకమే అయిన నేపథ్యంలో.. దాదాపు 30 సీట్లలో ప్రతికూల ఫలితాల్ని ఇచ్చే ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఒకవేళ.. వారికి టికెట్లు ఇవ్వకపోతే.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే.. జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. దీంతో ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నగా మారిందంటున్నారు.
తాజా పరిణామాల్ని చూస్తే.. కేసీఆర్ కు దెబ్బేసే 30 మంది ఎమ్మెల్యేల జాబితాను అనుసరించి వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది. 30 మంది సిట్టింగుల పని తీరు బాగోలేదని.. వారు ఎన్నికల్లో గెలవరన్న కారణాన్ని చూపించి టికెట్లు నిరాకరిస్తే.. వారే పార్టీకి ప్రమాదకరంగా మారతారని చెబుతున్నారు. వారికి టికెట్ల ఇవ్వకున్నా.. వారు పార్టీకి వ్యతిరేకంగా పని చేయకుండా..
బీజేపీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. తన ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించే కేసీఆర్ కు సొంత పార్టీకి చెందిన 30 ఎమ్మెల్యేలు వణుకు తెప్పిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కేసీఆర్ చేతికి అధికారపగ్గాలు ఇవ్వటం.. పోగొట్టటంలో 30 మంది ఎమ్మెల్యేలు కీలక భూమిక పోషించనున్నారని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.