ఇద్ద‌రు మామ‌లు ఒక అల్లుడు ? ఆ క‌థే వేర‌యా !

Update: 2022-04-22 07:59 GMT
రాజ‌కీయాల్లో ప‌ద‌వులు శాశ్వ‌తం కాదు చివ‌రి శ్వాస వ‌ర‌కూ ఆశించిన రీతిలో ప్రాధాన్యం లేక‌పోయినా జ‌గ‌నన్న వెంటే ఉంటానని ఇప్ప‌టిదాకా చాలా మంది మాజీలు (జ‌గ‌న్ 1.0 వెర్ష‌న్ కు చెందిన అమాత్యులు కొంద‌రు) స్పందించారు. కానీ బాలినేని మాత్రం తెలివిగా ఇది తమ కుటుంబ వ్య‌వ‌హారం అని తేల్చి క‌థ‌కు త‌నకు తెలిసిన విధంగా సుఖాంతం ఇచ్చారు. విద్యుత్ శాఖ ను నిర్వ‌హించిన ఆయ‌న గతంలో చంద్ర‌బాబు స‌ర్కారు చేసిన కొన్ని ఒప్పందాల‌ను (పీపీఏల‌ను) ర‌ద్దు చేయించే క్ర‌మంలో  జ‌గ‌న్ మాటే ప్రాధాన్యం అనుకుని ప‌నిచేశారు. ఆ త‌రువాత కూడా విద్యుత్ శాఖ‌కు సంబంధించి చాలా నిర్ణ‌యాలు తీసుకుని అమ‌లు చేయ‌డంలో అల్లుడి మాటే వేద‌వాక్కు అని భావించారు. అవును ! మామ ఇక్క‌డ బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి అయితే అల్లుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కావ‌డం ఈ క‌థ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామానికి సంకేతం.

ఈ నేప‌థ్యాన ఇద్ద‌రు మామ‌లు ఒక అల్లుడి క‌థ ఇది. ఓ విధంగా చాలా ఆస‌క్తిదాయ‌క క‌థ ఇది. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించే శ‌క్తి ఉన్న కుటుంబానికి చెందిన క‌థ ఇది.ఈ క‌థ‌లో మామ పేరు బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి. జ‌గన్ కు వ‌రుస‌కు మామ. మ‌రో మామ పేరు క‌మ‌లాపురం శాస‌న‌స‌భ్యులు, యోగి చిత్ర నిర్మాత పోచంరెడ్డి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి. బాబాయి చెల్లెలు భ‌ర్త బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి (నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ కీల‌క విద్యుత్ శాఖ‌ను నిర్వ‌హించారు. కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు కూడా !

కొన్ని ప‌రిణామాల్లో ఆయ‌న ప్ర‌మేయం లేక‌పోయినా కూడా ఇరికించార‌ని కూడా ఆయ‌న సొంత బంధు వ‌ర్గం సోష‌ల్ మీడియాలో వివ‌ర‌ణ ఒక‌టి ఇప్ప‌టికే ఇచ్చుకుంది కూడా ! ) .. ఇక ర‌వీంద్ర నాథ్ రెడ్డి అంటే విజ‌య‌మ్మ సొంత త‌మ్ముడు. పెద్ద త‌మ్ముడు అని రాయాలి. ఆ విధంగా మామ. స్వ‌భావ  రీత్యా ఈ ఇద్ద‌రికీ ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. వైవిద్య‌త‌లూ ఉన్నాయి. విభిన్న స్వ‌భావం కార‌ణంగానే ఆ ఇద్ద‌రూ త‌రుచూ వార్త‌ల్లో ఉండ‌రు. ఒక్క‌రే వార్త‌ల్లో ఉంటారు. ఒక‌రు తెర వెనుక త‌న ప‌ని తాను చేసుకుని పోతారు.

వీలున్నంత వ‌ర‌కూ ప‌ద‌వులు కావాల‌ని అడ‌గ‌రు. ప‌ట్టుబ‌ట్ట‌రు.ఆయ‌నే ర‌వీంద్ర నాథ్ రెడ్డి. సినిమా ఇండ‌స్ట్రీతో కాస్త ప‌రిచయాలు ఉన్న వ్య‌క్తి కూడా !

ఇక బాలినేని గురించి చెప్పుకుంటే మంత్రి ప‌ద‌వి నుంచి నిన్ను త‌ప్పిస్తాను మామ అని జ‌గ‌న్ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ నిత్యం అసంతృప్త వాదంతోనే ఉన్నారు. ఆ మాట బ‌య‌ట‌కు వ‌స్తే ఎక్క‌డ జ‌గ‌న్ దగ్గ‌ర చెడ్డ‌పేరు వ‌స్తుందోన‌ని మీడియా ఎదుట మాత్రం కాస్త జాగ్ర‌త్త‌గానే ఉన్నారు. నిన్న‌మొన్న‌టి వేళ ఆయ‌న్ను  రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ గా (నెల్లూరు, ప్ర‌కాశం, బాప‌ట్ల జిల్లాల‌కు సంబంధించి) నియ‌మించారు.

కానీ ఆయ‌న శాంతించిన విధం అయితే లేదు అనే తెలుస్తోంది. అందుకే రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ గా నియ‌మించిన త‌రువాత బాపట్ల కు వ‌చ్చే స‌మ‌యాన ఇటీవ‌ల ఆయ‌న అనుచ‌రులు మ‌రియు ముఖ్య  కార్య‌క‌ర్త‌లు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కూడా చేశారు. ఆ వార్త అన్ని మాధ్య‌మాల్లోనూ హ‌ల్చ‌ల్ చేసింది. అయినా కూడా జ‌గన్ కు ఎందుక‌నో ఈ మామ అంటే ఇష్టం. కానీ ర‌వీంద్ర తో మాత్రం వైరం లేదు అలా అని ఆయ‌న‌కు ప‌ద‌వుల ప‌రంగా ప్రాధాన్యం ఇవ్వాల‌న్న ఆలోచ‌న కూడా జ‌గ‌న్ కు లేనేలేద‌ని స్ప‌ష్టం అవుతోంది తాజా ప‌రిణామాల‌ను విశ్లేషిస్తే...! ఒకరితో మోదం ఒక‌రు భేదం అంటే ఇదేనేమో!
Tags:    

Similar News