'2024 ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు గనుక ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే అన్నీ వెనుకబడిన రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. మరి ఏ హోదాలో నితీష్ ఈ ప్రకటన చేశారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఈ మధ్యనే వికారాబాద్ లో జరిగిన ఒక బహిరంగ సభలో కేసీయార్ మాట్లాడుతూ బీజేపీయేతర పార్టీలు గనుక అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పుడు కేసీయార్ అయినా ఇపుడు నితీష్ అయినా ఏ హోదాతో ఇలాంటి హామీలిస్తున్నారో తెలీటం లేదు. బహుశా రైతులకు ఉచిత విద్యుత్, ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్లున్న రాష్ట్రాలను ఆకట్టుకోవటమే వీళ్ళ ఉద్దేశ్యం అయ్యుండచ్చు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఏ రాష్ట్రమైనా వద్దంటుందా ? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీయార్, నితీష్ తమిష్టమొచ్చిన హామీలిచ్చేస్తున్నట్లున్నారు.
నిజంగానే బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి వస్తే ఆ కూటమిలో ఎన్నిపార్టీలు ఉంటాయో ఎవరు చెప్పలేరు. ఆ కూటమిలోని అన్ని పార్టీలు అంగీకరిస్తే కానీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీని అమలుచేయలేరు.
మరపుడు దానివల్ల కేంద్ర ప్రభుత్వం మీదపడే బడ్జెట్ భారమెంత ? ఆ భారాన్ని కేంద్రం ఎలా మోయాలనే విషయాన్ని కేసీయార్ చెప్పలేదు. ఇప్పటికే 135 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న కేంద్రంపై ఉచిత విద్యుత్ పేరుతో మరింత భారాన్ని మోపాలన్నదే కేసీయార్ ఉద్దేశ్యమా ?
ఇక ప్రత్యేక హోదా విషయాన్ని చూస్తే ఇప్పటికే 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమల్లో ఉంది. ఏపీ హోదాను డిమాండ్ చేస్తోంది. ఇలాంటి రాష్ట్రాలు ఎన్నున్నాయో తెలీదు. వచ్చే ఎన్నికల్లోగా కేసీయార్, నితీష్ లాగ ఇంకెవరు ఎలాంటి హామీలు ప్రకటిస్తారనే విషయం ఆసక్తిగా ఉంది. మొత్తానికి ఉచిత హామీలివ్వటంలో మాత్రం నేతల మధ్య పోటీ మొదలైనట్లే అనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.