ఉండ‌వ‌ల్లికి స‌మాధానం చెప్పే ద‌మ్మున్న వాళ్లు వైసీపీలో లేరా ?

Update: 2021-10-13 16:30 GMT
ఏపీ ప‌రిస్థితి ఎలా ?  ఉన్నా ఏపీలో ప్ర‌భుత్వం మాత్రం చాలా బ‌లంగా ఉంది. అస‌లు అధికార ప‌క్షంపై ప్ర‌తిప‌క్షాల నుంచి ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే చాలు.. వారికి బ‌ల‌మైన కౌంట‌ర్లు ప‌డిపోతున్నాయి. చంద్ర‌బాబు, లోకేష్‌, టీడీపీ వాళ్ల‌పై కొడాలి నాని లాంటి మంత్రులు ఏ మాట‌ల‌తో విరుచుకు ప‌డుతున్నారో ?  చూస్తూనే ఉన్నాం. అంతెందుకు టీడీపీ సీనియ‌ర్లు అయ్య‌న్న‌, అశోక్‌గ‌జ‌ప‌తిరాజు లాంటి వాళ్ల‌నే రాయ‌డానికి వీలులేని ప‌దాల‌తో తిడుతున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొన్న ఓ సినిమా ఫంక్ష‌న్లో ఏపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్‌ను తిడితే చాలు ఆ మ‌రుస‌టి రోజే వైసీపీ మంత్రులు, కీల‌క నేత‌లు ప‌వ‌న్‌పై మూక దాడి చేశారు. ముప్పేట విరుచుకు ప‌డ్డారు. చివ‌ర‌కు ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా టార్గెట్‌గా చేసుకుని మాట్లాడారు. సిద్ధాంత ప‌ర‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని ఎవ్వ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు.. కానీ వైసీపీ వాళ్లు బోర్డ‌ర్ దాటేసి మ‌రీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌త్య‌ర్థిని మాన‌సికంగా బ‌ల‌హీనం చేస్తూ ... అస్స‌లు ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌కుండా చేసేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు.

స‌రే రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ కామ‌నే అని స‌రిపెట్టుకుందాం. మ‌రీ అదే వైసీపీ ప్ర‌భుత్వాన్ని సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఓ ఆటాడుకున్నారు. వైఎస్ ఫ్యామిలీకి ఎంతో అభిమానంగా ఉండే ఉండ‌వ‌ల్లి ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎంత దారుణంగా ప‌త‌న‌మ‌వుతుందో ? ఈ అప్పుల వ‌ల్ల ఏపీ జ‌నాలు భ‌విష్య‌త్తు ఎంత భ‌యాన‌కంగా ఉండబోతుందో ?  పూస‌గుచ్చిన‌ట్టు చెప్పారు. ఏపీని జ‌గ‌న్ అప్పుల కుప్ప చేసి ప‌డేస్తున్నారంటూ ఉండ‌వ‌ల్లి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు.

ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం చేసిన అప్పులు రు. 6 ల‌క్ష‌ల కోట్లు దాటేశాయ‌ని.. ఇంత మంది స‌ల‌హాదారుల‌ను పెట్టుకుని మ‌రీ ఏపీలో ఇంత ద‌య‌నీయ ప‌రిస్థితులు రావ‌డం బాధాక‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. చివ‌ర‌కు అమ‌రావ‌తిని సైతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాక‌ట్టుపెట్టేసి అప్పులు తెచ్చే ప‌రిస్థితి కూడా దాపురించింద‌ని అన్నారు.  ఉండ‌వ‌ల్లి లెక్క‌ల‌తో స‌హా దేశ‌, రాష్ట్ర దుస్థితి, అప్పులు గురించి చెప్పిన లెక్క‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో పాటు సామాన్యుల‌ను కూడా ఆలోచింప జేశాయి.

ఇదే విమ‌ర్శ‌లు వేరెవ‌రైనా ( టీడీపీ, జ‌న‌సేన నేత‌లు) ఈ పాటికి చేసి ఉంటే ష‌రా మామూలుగా వైసీపీ మంత్రుల నుంచి కీల‌క నేత‌లు, స‌ల‌హాదారుల వ‌ర‌కు ప్రెస్‌మీట్లు పెట్టేసి వారిని ఏకి ప‌డేసేవారు. అయితే ఇప్పుడు ఉండ‌వ‌ల్లి విష‌యంలో వారు ఏ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు.. మంత్రులు మౌనం దాలుస్తున్నారు. స‌ల‌హాదారులేమ‌య్యారో ?  తెలియ‌డం లేదని నెటిజ‌న్లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రో వైపు ఉండ‌వ‌ల్లి ఏపీ ఆర్థిక దుస్థితి గురించి చెప్పిన‌వి అన్నీ వాస్త‌వాలే అని ప్ర‌భుత్వంతో పాటు ఆ పార్టీ మంత్రులు, ప్ర‌భుత్వ యంత్రాంగం అంతా ఒప్పుకుంటుందా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఇక బ‌య‌ట సాధార‌ణ జ‌నాల్లో కూడా బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఏమ‌య్యారు ? అన్న ప్ర‌శ్న వ‌స్తోంది. ఏదేమైనా ఉండ‌వ‌ల్లి ప్రెస్‌మీట్ దెబ్బ‌కు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఆన్స‌ర్ అయితే స్ప‌ష్టంగా లేద‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ స్టార్ట్ అయ్యింది.

ఈ న్యూస్ గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటె క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో షేర్ చేసి కామెంట్ రూపం లో మాతో పంచుకోండి.
Tags:    

Similar News