ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా.. వైరల్ గా మారిన ఎస్బిఐ పాస్ బుక్..!

Update: 2022-12-17 02:30 GMT
ఫుట్ బాల్ వరల్డ్ కప్ (ఫిఫా)-2022 పోటీలకు ఖతార్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెల్సిందే. నవంబర్ 20 నుంచి ప్రారంభమైన ఫుట్ బాల్ మ్యాచ్ చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 18 తో ఫిపా వరల్డ్ కప్ పోటీలు ముగియనున్నాయి. ఇటీవల సెమీఫైనల్ మ్యాచ్ లో భాగంగా క్రొయోషియా.. అర్జెంటీనా మధ్య రసవత్తరమైన పోటీ జరిగింది.

ఈ మ్యాచ్ లో క్రొయోషియాపై అర్జెంటీనా సూపర్ విక్టరీ సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఫిపా మ్యాచ్ లు చివరి దశకు చేరుకోవడంతో ఫుట్ బాల్ అభిమానుల సందడి ఓ రేంజులో మొదలైంది. ఫిఫా వరల్డ్ కప్ లో భారత్ పాల్గొనక పోయినప్పటికీ భారత అభిమానులు మాత్రం ఫైనల్ కు చేరిన అర్జెంటీనాకు తమ మద్దతు తెలియజేస్తున్నారు.

అర్జెంటీనా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారతీయులు సైతం అర్జెంటీనా ఫైనల్ కు చేరడంపై వినూత్నంగా సెలబ్రేట్ చేస్తున్నారు. భారతీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బిఐ పాస్ బుక్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇండియన్లు అర్జెంటీనా జట్టుకు మద్దతు తెలియజేస్తూ ఉండటం గమనార్హం.

ఎస్బిఐ పాస్ బుక్ కవర్ ఫోటో.. అర్జెంటీనా జాతీయ జెండా ఒకే మాదిరిగానే ఉండటం వల్లే భారతీయులు ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. భారతీయులు అర్జెంటీనాకు మద్దతు తెలపడం వెనుక ఇదే అసలు కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా జెండా అందుబాటులో లేకపోతే ఎస్బిఐ పాస్ బుక్కులు అభిమానులు వినియోగించుకోవచ్చని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

మరికొందరు అర్జెంటీనాకు అఫీషియల్ భాగస్వామిగా ఎస్బీఐ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరీ భారతీయులు సపోర్టు చేస్తున్న అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ గా నిలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News