స్టాలిన్ కు చిరాకు పుట్టిస్తున్న పన్నీరు బ్యాచ్

Update: 2017-01-31 10:03 GMT
వ్యక్తిగత పూజ తమిళనాడులో ఎంత ఎక్కువో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ నటుల నుంచి రాజకీయ నాయకుల వరకూ.. అమితంగా అభిమానించటం.. ఆరాధించటం వారికి అలవాటే.  అయితే.. తమ అభిమానాన్ని బయటే కాదు.. తమిళనాడు అసెంబ్లీలోనూ అధికారపక్షం అదే పనిగా ప్రదర్శించటం విపక్ష నేత స్టాలిన్ కు చిరాకు పుట్టిస్తోంది.

ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో మంత్రులు.. అమ్మను పొగిడేసి.. ఆ తర్వాత చిన్నమ్మను తలుచుకొని.. ఆమె గొప్పతనాన్ని కీర్తిస్తున్న వైనం ప్రతిపక్షనేతకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఈ తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెనకాశి అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెల్వమోహన దాస్ పాండియన ఒక ప్రశ్న అడగ్గా.. దానికి సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి సెల్వరాజ్ చిన్నమ్మను కీర్తించటం.. ప్రశంసల వర్షం కురిపించారు.

ఇలాంటి వైఖరిని మానుకోవాలని తాము ఇప్పటికే చెప్పామని డీఎంకేనేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. అన్నాడీఎంకే నేతలు అస్సలు పట్టించుకోవటం లేదు. మంత్రుల తీరును తప్పు పట్టాల్సిందిగా విపక్ష నేతలు స్పీకర్ ను కోరగా.. మంత్రుల మాటల్లో తప్పు లేదని చెప్పటం.. విపక్షాల తీరును ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా మంత్రిచర్యను సమర్థించారు. అంతేకాదు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరూ ఆరోపణలు చేయకూడదని.. మంత్రి మాటల్లో ఎలాంటి తప్పు లేదని తేల్చేయటంతో విపక్ష నేతలు ఉడికిపోతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిన్నమ్మను పొగిడేస్తున్న తీరుపై డీఎంకే నేతల అభ్యంతరాలపై స్పందిస్తూ స్పీకర్ ధనపాల్.. అవసరమైతే.. డీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకుడ్ని ప్రశింసిస్తూ మాట్లాడితే తాను అభ్యంతరం చెప్పనని తేల్చేశారు. ఇలాంటివి తమిళనాడు అసెంబ్లీలోనే కనిపిస్తాయేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News