పోలవరం.. కాదు.. కాదు కాంట్రాక్టర్ల కు వరం

Update: 2018-12-17 15:59 GMT
పోలవరం. ఆంధ్రప్రదేశ్‌ లో అత్యంత ప్రతిష్టాత్యకమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కోసం నాటి వైఎస్‌. రాజశేఖర రెడ్డి ఎన్నో కలలు కన్నారు. కొన్ని లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు కారణంగా సాగునీరు అంది రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనుకున్నారు. వైఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా పనిచేసిన సమయంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో ముందుకెడుతోంది. అయితే ఈ ప్రాజెక్టు లో జరుగుతున్న అక్రమాల పై రోజురోజు కు అనేక కథనాలు వస్తున్నాయి.

ప్రాజెక్టు వేయం భారీ గా పెరగడం తో ఇందులో కోట్లాది రూపాయాల అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు ఇది ప్రచారమే అని అందరూ అనుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరగడం వాస్తవమే అని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ప్రకటించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి అర్జున్ రామ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా కొందరు కాంట్రక్టర్లకు రా‌ష్ట్ర ప్రభుత్వం అధిక చెల్లింపులు చేసిందని, వారి నుంచి ఆ చెల్లింపులను వెనక్కి తీసుకోవాలని పీపీఏ
సూచించిందని కూడా మంత్రి తెలిపారు.

పోలవరం హెడ్‌వర్క్స్ కాంట్రాక్టును ఏ కంపెనీకైన అనుకూలించేలా కేంద్రం నిర్ణయం తీసుకుందా అన్న ప్రశ్నకు కూడా మంత్రి సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ను కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలంటూ 2016 సెప్టెంబర్ 16న కేంద్రం ఒక లేఖ రాసినట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కాంట్రాక్టునైన ఎవరికైన ఇచ్చుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరాకు పోలవరం పనులు 62% వరకూ పూర్తి అయ్యాయని, ఈ పనులను ధవళేశ్వరంలోని క్వాలిటీ విభాగం పర్యవేక్షిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం పోలవరం పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంతో తమ కు నచ్చిన వారికి పనులు అప్పగించారని వారు ఇష్టారీతి గా నిధుల వెచ్చిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం పనులలో అవకతవకలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలు నిజమేనంటూ సాక్షాత్తూ కేంద్ర మంత్రే ప్రకటించడం ఇప్పుడు చర్చనీయంశం అయ్యింది.
Tags:    

Similar News