సినిమా షూటింగ్ వేళ వచ్చి 8 మంది మోడళ్లపై అత్యాచారం

Update: 2022-07-30 10:30 GMT
దక్షిణాఫ్రికాలో మృగాళ్లు రెచ్చిపోయారు. అందమైన మోడళ్లపై అదును చూసి అత్యాచారానికి పాల్పడ్డారు.  షూటింగ్ కోసం వచ్చిన 8 మందిని గుర్తించి మరీ అందంగా ఉన్న ఒక యువతిపై ఏకంగా 10 మంది గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. మరో యువతిపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఆ దేశవ్యాప్తంగా కలకలం రేగడంతో పోలీసులను సీరియస్ యాక్షన్ తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది.

వీడియో షూట్ కోసం వచ్చిన 8మంది అందమైన మోడళ్లపై ఓ సాయుధ ముఠా వచ్చి దారుణంగా అత్యాచారం చేసింది. మ్యూజిక్ షూట్ జరుగుతుండగా తుపాకులతో వచ్చిన సాయుధులు అమ్మాయిలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన దక్షిణాఫ్రికా దేశంలో చోటుచేసుకుంది.

ఎనిమిది మంది మోడల్స్ ను ఓ సాయుధుల ముటా బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ఓ చిన్న పట్టణంలో చోటుచేసుకుంది. మ్యూజిక్ వీడియో జరుగుతుండగా.. అక్కడకు దూసుకు వచ్చిన సాయుధులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని శుక్రవారం పోలీసులు తెలిపారు. జోహన్నస్ బర్గ్ కు పశ్చిమాన ఉన్న చిన్న పట్టణం క్రుగర్స్ డోర్స్ శివార్లలో గురువారం ఈ ఘటన జరిగింది.

ఇప్పటివరకూ 20 మంది అనుమానితుల్లో ముగ్గురిని భద్రతా సిబ్బంది  అరెస్ట్ చేశాయని హోంశాఖ మంత్రి భేకీ సేలే తెలిపారు. వీడియో షూట్ లకు చెందిన సెట్ ను సిద్ధం చేస్తుండగా ఈ ముఠా వచ్చి సిబ్బంది, నటీనటులపై దాడి చేసిందన్నారు.

18-35 ఏళ్ల మధ్య మహిళలు అత్యాచారానికి గురయ్యారని తెలిపారు. ఒక మోడల్ పై పది మంది, మరో యువతిపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అంతేకాకుండా పురుషుల దుస్తులు విప్పి  వారి వద్ద నుంచి వస్తువులను దోచుకున్నారని తెలిపారు. కాగా ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు సిరిల్ రమాఫోసో స్పందించారు. నేరస్థులను తక్షణమే అరెస్ట్ చేయాలని హోంశాఖ మంత్రిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News