పరీక్షకు హాజరైన ఎమ్మెల్యే

Update: 2019-02-12 07:23 GMT
ఎమ్మెల్యే ఏంటీ.. పరీక్షకు హాజరయ్యారేంటీ అనుకున్నారా? అవునండీ.. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎల్ ఎల్ ఎం(న్యాయవిద్య)  పరీక్షలు రాస్తున్నారు.  హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్ ఎల్ ఎం కోర్సులో చేరిన జీవన్ రెడ్డి కిందటేడాది రెండు సెమిస్టర్లు రాసి ఉత్తీర్ణత సాధించారు. కాగా సోమవారం మూడో సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు సుబేదారిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13, 15తేదిల్లో కూడా పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని వివరించారు.
 
న్యాయవిద్యపై ఆసక్తి ఎందుకని విలేకరులు ప్రశ్నించగా ప్రజలు తనను రెండు సార్లు గెలిపించారని మరోసారి కూడా గెలిపిస్తారని నమ్మకం ఏంటీ చమత్కరించారు. తాను జీవనోపాధి పొందేందుకు ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాను 11ఏళ్ల కిత్రమే హైకోర్టు బార్ మెంబర్ గా పని చేశానని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఐడీ కార్డు కూడా తన వద్ద ఉందని చెప్పారు. న్యాయవాదిగా హైకోర్టులో ఏడేళ్లు పనిచేశానని, సుప్రీం కోర్టులోనూ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఎల్ ఎల్ ఎం పూర్తయిన తర్వాత పీహెచ్ డీ కూడా చేస్తానని జీవన్ రెడ్డి అన్నారు. దీనివల్ల తనకు న్యాయవిద్యలో మరింత పరిజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. సుప్రీం కోర్టు కూడా ఇటీవల ప్రజాప్రతినిధులు కూడా కోర్టులో న్యాయవాదిగా పనిచేయవచ్చని తీర్పును ఇచ్చిందని దీనిని ప్రతిఒక్కరూ స్వాగతించాలని అన్నారు. ఏదిఏమైనా జీవన్ రెడ్డి కేవలం రాజకీయాలనే నమ్ముకోకుండా న్యాయవిద్యపై దృష్టిపెట్టడాన్ని పలువురు అభినందిస్తున్నారు.


Tags:    

Similar News