ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్‌ గోస్వామి దంపతులపై దాడి !

Update: 2020-04-23 09:50 GMT
ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌ - రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఆర్నాబ్‌ గోస్వామి దంపతులపై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్య‌క్తులు దాడికి పాల్పడ్డారు. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్‌ గోస్వామి - అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బైక్‌ పై దూసుకొచ్చిన వ్యక్తులు ఆర్నాబ్‌ వాహనం దాడికి ప్రయత్నించారు. తనపై దాడికి సంబంధించి ఆర్నాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ దాడిలో ఆర్నాబ్‌ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  అర్నాబ్‌ గోస్వామి - సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోస్వామి నిన్న ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ రాజీనామా చేసిన సంగతి తెలి సిందే. మహారాష్ట్రలోని పాల్‌ ఘార్ ‌లో ఇద్దరు సాధువులు - ఓ డ్రైవర్‌ పై గుంపు దాడి ఘటనపై టీవీ లైవ్‌ చర్చలో అర్నబ్‌ తన రాజీనామాను ప్రకటించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్‌ 3 డీసీపీ ప్రకటించారు.

ఈ ఘటనకు సంబంధించి ఆర్నాబ్‌ వీడియో సందేశాన్ని రిపబ్లిక్‌ టీవీ ట్విటర్‌ లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్‌ యూత్‌ నాయకులేనని అర్నాబ్‌ ఆరోపించారు.  తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ - ఆమె కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్‌ నిజం కోసమే పనిచేస్తుందని అన్నారు.
Tags:    

Similar News