ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని తిట్టాలనుకునే వారు.. రాజకీయంగా ఆయన్ను దెబ్బ తీసే వారు చెప్పే మాటల్లో.. చంద్రబాబుకు తెలిసినంత బాగా మీడియా మేనేజ్ మెంట్ మరెవరికీ తెలీదని.. రాదని జనరంజకంగా విమర్శిస్తారు. నిజంగా బాబుకు అంత సీన్ ఉందా? అంటే అవునని చెప్పలేం. తిట్టటానికి చంద్రబాబుకు ఇలాంటివి అపాదిస్తుంటారు కానీ.. నిజంగా ఆయనకు మీడియా మేనేజ్ మెంట్ తెలిస్తే.. ఇంత బద్నాం కావాల్సిన అవసరం ఉంటుందా?
సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ కూడా సొంత మీడియా సంస్థల్ని ఏర్పాటు చేసుకోలేని వ్యక్తుల్లో చంద్రబాబు నిలుస్తారు. సమకాలీన రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు మీడియా సంస్థల్ని నిర్వహించుకోవటం చూస్తున్నదే. సొంతంగా మీడియా సంస్థను ఏర్పాటు చేయటాన్ని బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. నిజంగా.. చంద్రబాబు కనుసైగ చేయాలే కానీ.. మీడియా సంస్థ పార్టీ నేతలకు అదేం పెద్ద విషయం కాదు.
అయితే.. ఇలాంటి వాదన వచ్చినప్పుడు చాలామంది చేసే వాదన ఏమిటంటే.. చంద్రబాబుకు సొంత మీడియా అవసరం ఏమిటని.. పచ్చ మీడియా సపోర్ట్ ఉంది కదా అని ప్రశ్నిస్తారు. నిజంగా.. పచ్చ మీడియా సపోర్ట్ కానీ చంద్రబాబుకు ఉండి ఉంటే.. చంద్రబాబును బాహాటంగా (సొంత మీడియా ఉన్న పార్టీల వాదనను సమర్థించుకున్నట్లుగా) వెనకేసుకొచ్చే వారెవరూ లేరు. అదే సమయంలో.. వివిధ అంశాల్ని పార్టీల సొంతమీడియాలు వెనకేసుకొచ్చినట్లుగా.. అడ్డగోలుగా వాదన వినిపించటం కనిపించదు.
అంతేకాదు.. ఎవరైనా తమ మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినప్పుడు.. తమ వాదనను సమర్థవంతంగా వినిపించి.. రిటార్ట్ ఇచ్చే ప్రత్యేక పనులేమీ పచ్చ మీడియా చేయదు. ఇలాంటి కారణాల వల్ల.. రాజకీయంగా చంద్రబాబు తిన్న ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ.. సొంత మీడియా ఏర్పాటుకు బాబు వ్యతిరేకమే.
మీడియా మేనేజ్ మెంట్ కు సంబంధించి బాబు గురించి చెప్పే దానికి.. చేతల్లో కనిపించేదానికి అస్సలు సంబంధం ఉండదు. సొంత మీడియా విషయంలో ఇప్పటికి తన తీరు మార్చుకోని చంద్రబాబు.. మీడియా మేనేజ్ మెంట్ లో ఎంతో కీలకమైన మరో అంశంలోనై అతగాడి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ల దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట ఉదంతాన్నే తీసుకుంటే.. ఈ ఘటనపై ఇంగ్లీషు ఛానల్ అయిన టైమ్స్ నౌ ఎడిటర్ అర్ణాబ్ గోస్వామి రెండు రోజులు చర్చా కార్యక్రమం పెట్టేసి దుమ్మే లేపేయటం తెలిసిందే. తన మాటల కత్తులతో తెలుగు తమ్ముళ్ల వాదనను ఖండించేయటం తెలిసిందే.
ఆర్ణాబ్ లాంటి దూకుడు జర్నలిస్ట్ నిర్వహించే కార్యక్రమానికి పాల్గొన్న వారు ఎవరంటే.. మంత్రి నారాయణ.. వర్ల రామయ్య.. లాంటి బ్యాచ్. తెలుగులోనే సక్రమంగా (ఆకట్టుకునేలా.. ప్రత్యర్థులు సమాధానం చెప్పేలా) ఏడవలేని ఈ నేతలు ఆర్ణాబ్ ను మాటలతో ఎదుర్కొవాలనుకోవటం దుస్సాహసమే. నిజానికి బాబు కానీ మీడియా మేనేజ్ మెంట్ అంత వచ్చి చచ్చి ఉంటే.. ఎలాంటి వారితో చర్చకు ఎవరు వెళ్లాలి? ఎలా తిప్పి కొట్టాలన్న దానిపై ముందస్తుగానే ఒక వ్యూహాన్ని రచించే వారు కదా. ఇంగ్లిషు భాష మీద పట్టు.. ప్రత్యర్థుల్ని తమ వాదనలతో ముప్పతిప్పలు పెట్టే వారు ఆర్ణాబ్ షో కు వెళ్లేలా చేయాలి. కానీ.. అదేమీ లేకుండా..రాజకీయాల గురించి ఓనామానాలు తెలియని వ్యాపార వేత్త.. మంత్రి నారాయణ వెళ్లటం ఏమిటి? ఇలాంటివి చూసినప్పుడు.. బాబుకు నిజంగా మీడియా మేనేజ్ మెంట్ తెలుసా అన్న ప్రశ్న తలెత్తుంది.