అర్నాబ్.. ఆ ఛానెల్ ను వాయించేశాడు

Update: 2017-04-18 08:56 GMT
ది నేషన్ వాంట్స్ టు నో.. ఇంగ్లిష్ న్యూస్ ఛానెళ్లు చూసేవారికి ఈ ఫ్రేస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టైమ్స్ నౌ ఛానెల్లో దశాబ్దానికి అర్నాబ్ గోస్వామి నడిపించే ‘న్యూస్ అవర్’ కార్యక్రమంలో ఆయన తరచుగా ఉపయోగించే మాట ఇది. కేవలం ఈ కార్యక్రమంతోనే టైమ్స్ నౌ ఛానెల్ సూపర్ పాపులరైంది. అదిరిపోయే టీఆర్పీ రేటింగులతో బోలెడంత ఆదాయం ఆర్జించింది. ఐతే గత ఏడాది అర్నాబ్ ఈ ఛానెల్ నుంచి బయటికి వచ్చేసి సొంతంగా ‘రిపబ్లిక్’ అనే ఛానెల్ పెట్టడానికి సన్నాహాలు చేయడం.. అర్నాబ్ లేని టైమ్స్ నౌ దారుణంగా దెబ్బ తినడం తెలిసిందే. ఐతే అర్నాబ్ బయటికి వెళ్లినప్పటి నుంచి టైమ్స్ నౌ అతడిని వేధింపులకు గురి చేస్తోందట. బెదిరింపులకు దిగుతోందట. తన కొత్త ఛానెల్లో ‘ది నేషన్ వాంట్స్ టు నో’ అనే అనే ఫ్రేస్ ఉపయోగిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ ఆ ఛానెల్ అతడికి నోటీసులు పంపిందట.

ఈ నోటీసుల విషయమై టైమ్స్ నౌ దుమ్ము దులిపేశాడు అర్నాబ్. ఇది ప్రజా సమస్యలకు సంబంధించి ఉపయోగించే ఫ్రేస్ అని.. ఇది తన హక్కు.. ప్రజల హక్కు.. ఈ దేశంలో నిజాలు తెలుసుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరి హక్కు అని అతనన్నాడు. తాను టైమ్స్ నౌ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి తన టీంను బెదిరించి.. భయపెట్టడానికి టైమ్స్ నౌ ప్రయత్నం చేస్తోందని.. ఈ బెదిరింపులకు భయపడేది లేదని అతనన్నాడు. ‘‘మీ లాయర్ల టీంను.. బోలెడంత డబ్బుల్ని రెడీ చేసుకోండి. నేను ఆ మాటను ఉపయోగించబోతున్నా. ఎంత ఖర్చు పెడతారో.. ఏం చేసుకుంటారో చేసుకోండి. దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి’’ అంటూ సవాల్ విసిరాడు అర్నాబ్. తన ఛానెల్ సమయానికి ఆరంభం కాకుండా టైమ్స్ నౌ అన్ని కుట్రలూ చేస్తోందని.. తన టీంలోని జర్నలిస్టుల్ని బెదిరిస్తోందని.. కానీ ఎవ్వరేం చేసినా అనుకున్న సమయానికి ఛానెల్ ఆరంభమవుతుందని అర్నాబ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News