సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన అర్నాబ్ ..ఎందుకంటే ?

Update: 2020-11-10 16:40 GMT
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోరారు. ఈ కేసులో అర్నాబ్ సహా మరో ఇద్దరు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిన్న బోంబే హైకోర్టు సముఖత చూపించలేదు.అలాగే బెయిల్ కోసం స్థానిక కోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. బెయిలు కోసం పిటిషనర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చునని కోర్టు పేర్కొంది. నాలుగు రోజుల్లోగా దీనిపై తాము నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు అన్నారు

రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకుండా ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ ఈ నెల 4న అర్నాబ్ సహా మరో ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సుప్రీంకోర్టులో అర్నాబ్ దాఖలు చేసిన పిటిషన్‌లో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు, అలీబాగ్ పోలీస్ స్టేషన్ అధికారులు, ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్‌ లను ప్రతివాదులుగా చేర్చారు.
Tags:    

Similar News