ముంబైలో టెలివిజన్ చానెళ్ల రేటింగ్ (టీఆర్‌పీ) స్కామ్ వ్యవహారం పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు మరాఠి చానెళ్లు టీఆర్పీల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని ముంబై పోలీస్ కమిషనర్ పరమవీర్ చేసిన ప్రకటన పెనుదుమారం రేపింది. అయితే, తమపై కక్ష సాధింపులో భాగంగానే పరమ్ వీర్ అలా చెబుతున్నారని రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి అన్నారు. పరమ్ వీర్ పై పరువునష్టం దావా వేస్తామని చెప్పిన ఆర్నబ్....ఇటువంటి వ్యవహారాలకు భయపడనని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్నబ్ చుట్టూ ముంబై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. రిపబ్లిక్ టీవీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎ్‌ఫవో) ఎస్.సుందరం, కొందరు సీనియర్ ఉద్యోగులను, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. చానెల్ కు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారంతా శనివారం కూడా విచారణకు రావాలని చెప్పారు. వీరి విచారణ తర్వాత ఆర్నబ్‌ను కూడా విచారణకు పిలిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రిపబ్లిక్ టీవీ ఆడిట్ రిపోర్టులను, బ్యాంకు ఖాతాలను, పలు వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పరమ్ వీర్ అన్నారు. ఈ చానెల్ ప్రారంభించడానికి, నడపడానికి డబ్బెలా వచ్చిందన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామన్నారు. ఈ వ్యవహారంపై ఆర్నబ్ మరోసారి స్పందించారు. ఈ కేసులకు భయపడబోనని, తానో సైనికాధికారి కొడుకునని అన్నారు. ఈ కక్ష సాధింపు చర్యలు తనకు కొత్తేం కాదని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని చెప్పారు. ఈ రకమైన అర్థం వచ్చే కవితను తన ప్రైమ్‌టైమ్ షోలో చదివి వినిపించారు ఆర్నబ్. ఈ వ్యవహారం వెనుక సోనియా, రాహుల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారని ఇదంతా పెద్ద కుట్ర అని ఆరోపించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన పరమ్ వీర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో ఇండియాటుడే పేరు రావడంపై ఆ చానెల్ స్పందించింది. వెల్లడించింది. తమపై బురదజల్లేందుకు రిపబ్లిక్ టీవీ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ఇది భాగం’ అని ఇండియాటుడే తెలిపింది.