మాటలతో తాట తీయటం ఎలా ఉంటుందంటే.. టైమ్స్ నౌ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి చర్చా కార్యక్రమం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కొమ్ములు తిరిగిన మొనగాళ్లు లాంటి రాజకీయ నేతలు సైతం ఆయన మాటల ధాటి ముందు తేలిపోతారు. మాటల కోసం ప్రయత్నిస్తుంటారు. వారు పదాలు కూడదీసుకొని చెప్పేంతలో తన మాటలతో నోరు మూయించే తత్వం అర్నబ్ కు కాస్త ఎక్కువే. భారత జర్నలిస్టుల్లో నోటి మాటలతో విరుచుకుపడే వ్యక్తి ఎవరంటే అర్నబ్ గోస్వామి మొదటిస్థానంలో నిలుస్తారు.
మామూలుగానే ఫైర్ బ్రాండ్ గా ఉండే ఈ జర్నలిస్టు.. ఇటీవల భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల అనంతరం ఆయన మరింత ఫైర్ అవుతున్నారు. పాక్ కు దన్నుగా నిలిచేటట్లుగా చూచాయి వ్యాఖ్య చేసినా ఉతికి ఆరేస్తున్నారు. అర్నబ్ మాటల ప్రభావం ఎంతంటే.. చివరకు పాకిస్థాన్ లోని ఉగ్రవాదులకు సైతం మంట పుట్టేసింది. ఆయన్ను టార్గెట్ చేయాలన్న నిర్ణయానికి కూడా వారు వచ్చేశారట. ఈ అంశాన్ని నిఘా వర్గాల చెవిన పడటం.. ఆ వెంటనే ప్రభుత్వం దృష్టికి వెళ్లిపోవటం జరిగిపోయాయి.
దీంతో.. అర్నబ్ కు ప్రభుత్వం పటిష్టమైన వై సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వీవీఐపీ మంత్రులకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఇచ్చే వై సెక్యూరిటీని.. దేశంలో ఒక జర్నలిస్టుకు ఇవ్వటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. తన టీవీ షోలో బుల్లెట్ లాంటి మాటలతో విరుచుకుపడే అర్నబ్ గోస్వామి దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా ఉండేందుకు వీలుగా ఆయనకు మొత్తంగా 20 మంది సుశిక్షితులైన సిబ్బంది ఆయనకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/