అంచనాలు తప్పయ్యాయి. సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు ఉత్తవనే తేలిపోయింది. మోడీ సర్కారు ప్రవేశ పెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ను సంప్రదాయానికి భిన్నంగా ఆర్థికమంత్రి జైట్లీ హిందీలో ప్రసంగిస్తారన్న వాదన వినిపించింది.
దేశ ప్రజలందరికి అర్థమయ్యేలా ఇప్పటివరకు బడ్జెట్ ప్రసంగాలన్నీ ఇంగ్లిషులోనే సాగాయి. ఈ సంప్రదాయాన్ని ఈసారి జైట్లీ బ్రేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అందుకు భిన్నంగా జైట్లీ సంప్రదాయాన్ని కొనసాగించారు. తన బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిషులోనే చేశారు. అయితే.. మధ్య మధ్యలో మాత్రం హిందీలో ప్రసంగించారు. బడ్జెట్ ప్రసంగంలో అత్యధికంగా ఇంగ్లిషులోనే సాగింది.
సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన బడ్జెట్ ప్రసంగాన్ని సాగించిన జైట్లీ.. రైతుల కోసం సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు రానుండటం.. అన్ని అనుకూలిస్తే.. ఈ ఏడాది చివర్లోనే ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందన్న మాట వినిపిస్తున్న వేళ.. వ్యవసాయానికి.. గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేస్తారంటూ వెలువడిన అంచనాలకు తగ్గట్లే జైట్లీ బడ్జెట్ ఉండటం గమనార్హం. అన్నింటికి మించి తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలెట్టినంతనే సంచలన ప్రకటన చేశారు.
రైతుల మీద వరాల వర్షం కురిపించిన కేంద్రమంత్రి.. రైతులు పండించే ఉత్పత్తులకు.. వారి ఉత్పత్తి ధర కంటే 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చేలా హరిత ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. మొత్తంగా రైతుల మనసుల్ని దోచుకునేలా.. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ క్రేజ్ మరింత పెరిగేలా చేశారని చెప్పాలి.