పొలిటికల్ పార్టీలకు పండగేం కాదంట

Update: 2016-12-18 05:00 GMT
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిసెంబరు 30 లోపు రాజకీయ పార్టీలు బ్యాంకుల్లో జమ చేసే మొత్తాలపై ఎలాంటి విచారణ ఉండదని.. ఎంత మొత్తం డిపాజిట్ చేసినా వాటి గురించి పట్టించుకోరంటూ వస్తున్న వార్తల్లోనిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేస్తున్నారు. వ్యక్తులకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో.. అలాంటి రూల్సే పార్టీలకు వర్తిస్తాయని వెల్లడించారు.

సవరించిన ఆదాయపన్ను చట్టాల నుంచి రాజకీయ పార్టీలకు మినహాయింపులేమీ లేవని జైట్లీ స్పష్టం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్నవార్తల్లో నిజంలేదని.. రాజకీయ పార్టీలకు మినహాయింపులు ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలోనిజం లేదని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన వారి మాదిరే రాజకీయ పార్టీలు సైతం తమ దగ్గరి పాత నోట్లను డిసెంబరు 30లోపు బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చని.. వారి ఆదాయ వనరుపై ఐటీశాఖకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు.

రద్దు అయిన నోట్లను ఏ రాజకీయ పార్టీ అయినా స్వీకరిస్తే అది చట్ట విరుద్దమవుతుందని.. రాజకీయ పార్టీలకు ఐటీ చట్టాల్లో ఎలాంటి మినహాయింపులు.. సడలింపులులేవన్నారు. ఇక.. రాజకీయ పార్టీల బ్యాంకు ఖాతాల్ని కూడా పరిశీలించనున్నట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. రూ.20వేలకు పైబడి వచ్చే విరాళాలపై పన్ను విధిస్తామని చెప్పిన కేంద్ర ప్రత్యక్ష బోర్డు.. రూ.20వేలకు పైన మొత్తాల్ని విరాళాలుగా ఇచ్చే వ్యక్తి వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పింది. పార్టీలకు పండగే అంటూ ఐటీ శాఖ మినహాయంపులపై జైట్లీ ఇచ్చిన వివరణ రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News