వైటు.. బ్లాకు అని బయట మాట్లాడినప్పుడు అమ్మో అనుకుంటాం కానీ.. రోజువారీ జీవితంలో చాలామంది చాలా విషయాల్లో వైటు.. బ్లాక్ అంటూ సింఫుల్ గాలావాదేవీలు చేసేస్తుంటాం. అదేమంటే.. ఎప్పుడో ఒకసారి చేసే వాటిని కూడా తప్పంటారా? అని ఎదురుప్రశ్నించే వారు కనిపిస్తారు. రోజూ లక్షల్లో అడ్డదిడ్డంగా లావాదేవీల్ని నిర్వహించే వారిని ఏమీ చేయరు కానీ.. జన్మకో శివరాత్రి అన్నట్లుచేసే వాడికి రూల్స్ చెప్పి బయపెడతారా? అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తంచేస్తుంటారు.
ఇకపై ఇలాంటి వాదనలు చెప్పే వారు కాస్త ఆలోచించి మాట్లాడాల్సిందే. ఇష్టంవచ్చినట్లుగా బ్లాక్ మనీని సర్క్యులేట్ చేసే వారికే కాదు.. బ్లాక్ లో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవాలంటేనే దడ పుట్టించే నిబంధనను కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించేశారు. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసే ఈ కొత్త రూల్ విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. చట్టం తెలీదని చెప్పినా మాటచెల్లకపోవటమే కాదు.. భారీగా ఆర్థికనష్టం వాటిల్లే ప్రమాదం తాజా రూల్ తో పొంచి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూ.3లక్షలకు మించిన నగదు లావాదేవీ ఏది చేసిన మెడకు చుట్టుకున్నట్లే. రూ.3లక్షలకు మించిన నగదు లావాదేవీ చేసినప్పుడు దొర్కపోయినా.. తర్వాతి కాలంలో ఎప్పుడు దొరికినా..రూ.3లక్షలకు మించినమొత్తం ఎంత అయితే చేస్తామో అంత మొత్తాన్నిప్రభుత్వానికి ఫైన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
తాజా బడ్జెట్ లో తీసుకొచ్చిన నిబంధన రూ.3లక్షలకు మించిన నగదు లావాదేవీలు చేసే వారికి చుక్కలు చూపించే పరిస్థితి. ఐటీ చట్టంలో చేస్తున్నసరికొత్త సవరణ భారీ మార్పులకు కారణం కానుంది. బ్లాక్ మనీని గుట్టుచప్పుడు కాకుండా సర్క్యులేట్ చేసే వారికి షాకిస్తూ మోడీ సర్కారు తీసుకున్న తాజానిర్ణయం చాలా కఠినమైనదని చెప్పక తప్పదు. బ్లాక్ మనీ లాంటి పెద్ద మాటకాకున్నా.. పన్ను కక్కుర్తితో చేసే తప్పునకు బారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి.
ఈ చట్టాన్నిచాలా సింఫుల్ గా చెప్పుకొస్తే.. మీకో ఇల్లు ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగోలేకో.. లేదంటే మరింత పెద్దదైన ఇల్లు కొనాలన్న ఉద్దేశంతో దాన్ని అమ్మాలని అనుకున్నారు. బేరం పెట్టేశారు. యాభై లక్షలకు బేరం కుదిరింది.
రూ.50లక్షలకు అమ్మితే.. ఆ భారీ మొత్తాన్ని ఆదాయంగా చూపిస్తే పన్ను కట్టాల్సివస్తుందన్న కక్కుర్తి కావొచ్చు.. లేదంటే ఇల్లు కొనే ఆయన.. అంత మొత్తాన్నిఅధికారికంగా చూపిస్తే తనకు రిజిస్ట్రేషన్ భారీగా పడుతుందన్న ఉద్దేశంతోరూ.30లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకుందామని.. మిగిలిన రూ.20లక్షలు క్యాష్ ఇచ్చేస్తాడని చెప్పాడనుకుందాం.
సర్లే అని మీరు కానీ అన్నారా? మీరు అడ్డంగా బుక్ అయినట్లే. ఎందుకంటే..ఇలాంటి లావాదేవీలు చేసినప్పుడు డబ్బులు ఇచ్చిన వాడిని వదిలేసి..డబ్బులు తీసుకున్న వాడిని బాధ్యత వహించేలా జైట్లీ మాష్టారు కొత్త రూల్ పెట్టేశారు. దీంతో.. రూ.20లక్షలు నగదు రూపంలో తీసుకున్న మొత్తాన్ని తర్వాతి కాలంలో ఎప్పుడైనా మీరు దొరికితే.. మీరు తీసుకున్న రూ.20లక్షలు కట్టేయాల్సిందే. ఒకవేళమీరు దొరక్కపోయినా.. మీ దగ్గర ఇల్లు కొన్న వాళ్లు.. ఏదైనా లెక్క తేడా వచ్చిదొరికిపోయాడనుకోండి.. అతను కానీ..తాను చేసిన నగదు లావాదేవీ గురించి చెప్పాడా? అమ్మిన పాపానికి మీరు అడ్డంగా బుక్ అయినట్లే.
ఇల్లే కాదు.. మీ దగ్గరి కారు సెకండ్ హ్యాండ్ కి అమ్మాలనుకున్నారు. కారును రూ.5లక్షలకు అమ్మారని అనుకుందాం. రూ.1.5లక్షలు చెక్కు.. మరేదైనా రూపంలో తీసుకొని రూ.3.5లక్షల్ని క్యాష్ రూపంలో తీసుకున్నారనుకోండి.. తర్వాతి కాలంలోఈ వ్యవహారం బయటకు వస్తే.. మీరు క్యాష్ రూపంలో తీసుకున్న రూ.3.5లక్షల్నిప్రభుత్వానికి పరిహారం రూపంలో చెల్లించక తప్పని పరిస్థితి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/