కేంద్రంలో అత్యంత పవర్ ఫుల్ కేంద్రమంత్రుల్లో అరుణ్ జైట్లీ ఒకరు. మోడీ ప్రభుత్వంలో ఆయనెంత కీ రోల్ ప్లే చేస్తున్నారో.. ఆయన పోర్ట్ ఫోలియోను చూస్తే ఇట్టే అర్థం కావటం ఖాయం. అలాంటి జైట్లీ సహనాన్ని పీక్స్ కు తీసుకెళ్లిన వైనం ఒకటి ఆసక్తికరంగా మారింది. ప్రశ్నలతో చిరాకు పెట్టిస్తున్న తన ప్రత్యర్థి న్యాయవాది తీరుకు ఆయన విపరీతమైన ఆగ్రహానికి గురైనట్లుగా చెబుతున్నారు. తనను ముప్పతిప్పలు పెట్టేలా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలానీ ప్రశ్నలపై జైట్లీ తీవ్రంగా మండిపడినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ గతంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దీనిపై రియాక్ట్ అయిన జైట్లీ ముఖ్యమంత్రి పైన రూ.10కోట్ల మేర పరువునష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ ఢిల్లీ హైకోర్టులో జరుగుతోంది. జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసే క్రమంలో భాగంగా ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలానీ రంగంలోకి దిగారు. గడిచిన మూడు రోజులుగా జైట్లీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన వరుసగా వేస్తున్న ప్రశ్నలతో జైట్లీ ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లుగా తెలుస్తోంది. జైట్లీ తాను చేసిన నేరాన్ని దాచి పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ రాంజెఠ్మాలానీ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ పదాల్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా జైట్లీ జాయింట్ రిజిష్టార్‌ను కలిశారు. మోసం లాంటి పదాలతో తనను దెబ్బ తీయాలని చూస్తున్నారని.. ఇలాంటి పదాలతోనే తనను ప్రశ్నించాలని కేజ్రీ నుంచి సూచనలు అందాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. క్రాస్ ఎగ్జామిన్ పై జైట్లీ ఈస్థాయిలో విరుచుకుపడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/