నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ఒక భారీ ప్రకటన చేశారు. పెద్ద నొట్లు రద్దు చేస్తున్నామని - ఉప సంహరణతోనే నల్లధనంపై మహాయుద్ధం ప్రకటించామని.. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతం అయిపోతుందని - నల్ల ధనం సమస్యనుంచి భారతదేశానికి విముక్తి అని, ఈ ప్రక్రియ అనంతరం (యాభై రోజుల తరువాత) దేశంలో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని ప్రకటించారు! అయితే మోడీ నాడు ప్రకటించిన యాభయ్యో రోజు దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో మోడీ తలచినది అని చెబుతున్న నల్లధనం అంతం అయ్యిందా.. మోడీ అండ్ కో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం ఏమైనా కలిగిందా.. సామాన్యుడు తప్ప నల్లబాబులు ఎవరైనా ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడ్డారా.. ఈ విషయాలు అందరికంటే బీజేపీ పెద్దలకే బాగా తెలుసు. దీంతో ఈ నిర్ణయం చాలా చిన్నదని చెప్పే పనికి పూనుకున్నారు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం భారీ ఎత్తున నల్లధనం బయటకి వస్తుందని చెప్పారు కానీ, చెలామణిలో సొమ్మంతా డిపాజిట్ల రూపంలో మరోసారి బ్యాంకుల్లోకి వచ్చేస్తోందనే షాకింగ్ న్యూస్ రోజు రోజుకీ వెలుగులోకి వస్తుంది! ఈ లెక్కన మరి నల్లధనం ఏమైనట్లు.. మొత్తం సొమ్మంతా బ్యాంకులకు వస్తే బ్లాక్ మనీ ఎక్కడున్నట్టు.. ఈ లెక్కన చుసుకుంటే నల్లలెక్క తప్పుతోందనే విషయం సుస్పష్టం. దీనికి కారణం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఈ నిర్ణయం ప్రకటించలేదనేది ఎక్కువమంది చెప్పే విషయం. ప్రస్తుతం ఉన్న ఏటీఎం మిషన్స్ లో కొత్త రెండువేల రూపాయల నోటు సరిపోదనే చిన్న విషయాన్ని గ్రహించలేకపోయిన ప్రభుత్వ పెద్దల పెద్ద చూపు, ముందు చూపు నిర్ణయం వల్ల - నేరుగా నోట్ల ప్రింటింగ్ స్థలాల నుంచే కొత్త నోట్లు ధనవంతుల ఇళ్లకు చేరుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... పెద్ద నోట్ల రద్దు విషయంలో బీజేపీ పెద్దలకు మరో కొత్తపని వచ్చి పడింది. నిన్నటివరకూ పెద్ద నోట్ల రద్దు నల్లధనం పై యుద్దం అని, ఈ నిర్ణయం అనంతరం మామూలుగా ఉండదని చెప్పిన వీరే... ఇప్పుడు ఈ పెద్దనోట్ల రద్దు నిర్ణయం చాలా చిన్న విషయమని, కేవలం తొలి అడుగు మాత్రమే అని చెప్పాల్సి వస్తుంది!!
ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడిన - పడుతున్న ఇబ్బందులు.. పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ! నల్లధనం పై పోరాటంలో పెద్ద నోట్ల రద్దు అనేది ఒక భాగం మాత్రమేనని, దశలు వారిగా జరిగే ఈ పోరాటంలో ఒక్కోటీ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఇదే క్రమంలో నల్లధనంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ప్రభుత్వం ఆలోచనను తెలిపే మరో సంగతి బయటపెట్టారు అరుణ్ జైట్లీ. అదేమిటంటే... నవంబర్ 8కి ముందుగానీ, ఆ తరువాతగానీ ప్రభుత్వం దగ్గర నల్లధనానికి సంబంధించిన లెక్కలేవీ లేవట. అంటే... దేశంలో ఎంత నల్లధనం ఉందో కూడా తెలియకుండానే పెద్ద నోట్లను రద్దు చేసేశారు, లెక్కా పత్రం లేకుండానే బ్లాక్ మనీపై పోరాటం ప్రారంభించేశారు అన్నమాట! ఇది 120కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి సంబంధించిన విషయమనుకున్నారా? లేక చిన్నా చితకా వ్యవహారమనుకున్నారా? అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించాలనుకుంటున్నారా? అలా చేస్తే దేశాభివృద్ధికి మీరు ఆటంకపరులైనట్లే.. అనే సెటైర్స్ వినిపిస్తున్నాయి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/