కొత్త రూ.1000 నోట్ల‌పై షాకింగ్ ట్విస్ట్‌

Update: 2016-11-17 12:52 GMT
దేశ‌వ్యాప్తంగా హెచ్చుమీరుతున్న న‌ల్ల‌ధ‌నాన్ని కంట్రోల్ చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పెద్ద‌వైన రూ.1000 - రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మోడీ నిర్ణ‌యంతో ఇప్పుడు దేశం మొత్తం పాత - కొత్త నోట్ల అంశంపై ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లోపలా - బయటా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రతిపక్షాలు కేంద్రంపై ఒత్తిడి పెంచాయి.

ఇదిలా రూ.1000 - రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం వాటి స్థానంలో కొత్తగా రూ.2000 వేల నోటుతో పాటు కొత్త రూ.500 నోట్ల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. కొత్త‌గా రూ.1000 నోటు కూడా వ‌స్తుంద‌న్న ఆశ‌తో ప్ర‌జ‌లు ఉన్నారు. అయితే ఇదే అంశంపై గురువారం స్పందించిన కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ షాక్ ఇచ్చారు.

కొత్త డిజైన్‌ తో వెయ్యి రూపాయల నోట్లను విడుదల చేసే ఆలోచన ఇప్పట్లో లేదని ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. దీంతో మ‌నం ప్ర‌స్తుతం రూ.2000  - రూ.500 నోట్ల‌తోనే స‌ర్దుకోవాలి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఆధార్ కార్డు ద్వారా ఇస్తోన్న రూ. 4500 న‌గ‌దును రూ.2000 వేల‌కు త‌గ్గించ‌డంపై ఆయ‌న స్పందిస్తూ అందుబాటులో ఉన్న నిధులు అంద‌రికి సద్వినియోగంగా ఉండాల‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

ఇక గురువారం నుంచి దేశంలో ఉన్న ఏటీఎంల‌ను రీకాలిబరేట్ చేసి - వాటి నుంచి కొత్త రూ. 2000 నోటు సహా అన్నింటినీ విత్‌ డ్రా చేసుకోడానికి వీలుగా తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఇక పెళ్లి ఖ‌ర్చుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఖర్చుల కోసం రూ. 2.5 లక్షలు తీసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News