ఏపీకి కేంద్రం నుంచి దక్కాల్సిన సాయం - హామీల అమలు విషయంలో ఇంతకాలం మెతగ్గా ఉన్న సీఎం చంద్రబాబు ఇటీవల కాస్త స్పీడు పెంచారు. విభజన చట్టం హామీలను అమలు చేయాల్సిందిగా శాసనసభలో తీర్మానం చేశారు. దాంతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నది ఆయన ప్లాను. అయితే... ఈ తీర్మానాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ తీర్మానంతో రాజకీయంగా అటు మిత్రపక్షమైన బీజెపి - ఇటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలనే వ్యూహం బెడిసికొట్టినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 17 అంశాలతో కూడిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 16వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా - ఆర్ధిక వనరుల కొరతను అధిగమించేందుకు నిధులు విడుదల చేయటం.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని 2018 నాటికి పూర్తిచేయాలని.. పారిశ్రామికీకరణను ప్రోత్సహించి ఆర్ధికాభివృద్ధిని పెంపొందించేందుకు పన్ను రాయితీలు తదితర ప్రోత్సాహకాలు కల్పించాలని.. నూతన రాజధాని నిర్మాణానికి తగిన ఆర్ధిక సహకారం.. శాసనసభ స్థానాల పెంపు.. ఉద్యోగుల స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ.. విశాఖపట్నం రైల్వేజోన్.. సెక్షన్ -8 అమలు - షెడ్యూల్ 9 - 10 - 13 ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాతో పాటు జాతీయ విద్యాసంస్థలు - పరిశోధనా కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలను అమలు చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. కానీ... కేంద్రంలోని బీజెపి - రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీల మధ్య గత కొంతకాలంగా ఇదే విషయమై అంతర్గతంగా స్పర్ధలు రగులుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ముందస్తు వ్యూహంలో పార్టీలు నిమగ్నమైన నేపథ్యంలో చేసిన ఈ తీర్మానాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వివిధ మంత్రిత్వశాఖల పరిధిలో ఏపికి తగిన ఆర్ధిక సహాయం ..సహకారం అందిస్తున్నా తమపై బురదచల్లే కార్యక్రమాన్ని చేపట్టిందనే వాదన కేంద్ర మంత్రిత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సైతం ఈ వ్యవహారంపై మండిపడుతున్నట్లు బీజెపి వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అంతేకాదు జైట్లీ చంద్రబాబుకు నేరుగా పది ప్రశ్నలు సంధించినట్లు కూడా తెలియవచ్చింది. ఇప్పటి వరకు ఏపికి మంజూరు చేసిన నిధుల వివరాలను ఇప్పటికే రాష్ట్ర బీజెపి ప్రచారం చేస్తోంది. కాగా రాష్ట్ర ఆర్దిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటూనే ధనిక రాష్ట్రంగా చెప్తున్న తెలంగాణ కు ధీటుగా బడ్జెట్ ను ఎలా రూపొందించారని నేరుగా అరుణ్ జైట్లీ చంద్రబాబు ను ప్రశ్నించినట్లు సమాచారం. మౌలిక వసతులులేవు.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలులేవని చెప్తున్న మీరు దేశ సగటుకన్నా వృద్ధిరేటు సాధించామని చెప్తున్నప్పుడు ప్రోత్సాహకాలు ఎలా అందుతాయి.. ఇందుకు పొరుగు రాష్ట్రాలు ఎలా అంగీకరిస్తాయనే వాదనలు బీజేపి కేంద్రమంత్రులు లేవనెత్తుతున్నారు. హుదుద్ తుపాను.. పోలవరం..రెవిన్యూలోటు అంచనాలలో వ్యయాన్ని పెంచడం వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని కేంద్రంలోని ఆయా మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. వెనుకబడిన రాయలసీమ - ఉత్తరాంధ్రలకు విభజన చట్టం ప్రకారం పన్నుల రాయితీలు.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టం చెప్తుంటే అమరావతికి రాయితీలిస్తే మా సంగతేంటని పొరుగు రాష్ట్రాలు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని ప్రాధాన్యతా క్రమంలో ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అరుణ్ జైట్లీ భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆర్ధిక పరిస్థితి సక్రమంగా లేనప్పుడు పొరుగు ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ దుబారా..సబ్సిడీలు అందించటం దేనికని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ చేసి అది కేంద్రం భరించాలనటం సమంజసం కాదని వాదిస్తున్నారు. పోలవరం అంచనా వ్యయం పెంచేటప్పుడు కేంద్రం అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ విషయాన్ని కేంద్రం తప్పుపట్టినట్లు చెప్తున్నారు. ఒకప్పుడు ఆర్ధిక క్రమశిక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన మీరు.. ఇప్పుడు దుబారా విమాన పర్యటనలు చేస్తూ పేదరికం తక్కువ ఉన్న మీ రాష్ట్రంలో పండుగ కానుకలకు వందల కోట్లు దుర్వినియోగం చేయటం ఎందుకు.. ఒఢిషా - కర్నాటక రాష్ట్రాల్లో కంటే ఉద్యోగులకు జీతాలు ఎలా ఎక్కువగా చెల్లిస్తున్నారనే ప్రశ్నలను ఆయా రాష్ట్రాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని జైట్లీ చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఒక్క ప్రత్యేక హోదా మినహా మిగిలిన అన్ని అంశాల్లో సానుకూలంగా స్పందించినా విమర్శలు వస్తున్నాయని ఇకపై పార్టీపరంగా సమాధానాలివ్వాల్సిన అవసరం ఉందని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ - వృద్ధి రేటు బడాయిలే చంద్రబాబును జైట్లీ ముందు బకరా చేశాయన్న వాదన వినిపిస్తున్నాయి.