సిక్కిం సరిహద్దుల్లో చైనాతో ఏర్పడిన ఉద్రిక్తతలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. భారత బలగాలు తమ భూభాగంలోకి వచ్చాయంటూ చైనా తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. 1962 యుద్ధాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి అంటూ ఇండియన్ ఆర్మీకి చైనా వార్నింగ్ ఇచ్చింది. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. 1962 యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోండంటూ చెప్పిన చైనా అప్పటికీ - ఇప్పటికీ ఇండియా చాలా మారిందని గుర్తించాలని అన్నారు. `1962 ఇండియాకి, 2017 ఇండియాకి చాలా తేడా ఉంది. అది చైనా తెలుసుకోవాలి` అని జైట్లీ ఘాటుగా స్పందించారు.
నిజానికి చైనా చెబుతున్న భూభాగం తమదని భూటాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇదే విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. ``భూటాన్ ప్రభుత్వం ప్రకటనతో అక్కడ పరిస్థితి ఏంటో స్పష్టమైంది. అది భూటాన్ భూభాగం. ఇండియన్ బోర్డర్‌కు దగ్గరగా ఉంది. అక్కడ ఇండియా - భూటాన్ కలిసి భద్రత కల్పించేలా ఒప్పందం కుదిరింది`` అని జైట్లీ తెలిపారు. ఇతర దేశాల భూభాగాన్ని ఇండియా ఆక్రమిస్తున్నదని చైనా చెబుతున్నదని, అది పూర్తిగా అబద్ధమని ఆయన స్పష్టంచేశారు.
కాగా, సిక్కిం సెక్టార్ లోని తమ సరిహద్దులనుంచి భారతదేశం తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని, అప్పుడే అర్థవంతమైన చర్చలు జరపడానికి ఆస్కారముంటుందని చైనా పేర్కొంది. భారత సైన్యం ”చరిత్రనుంచి పాఠాలు” నేర్చుకోవాలని అన్యాపదేశంగా 1962నాటి యుద్ధాన్ని ప్రస్తావించింది. చైనా భూభాగంలోకి భారత సైన్యం అక్రమంగా ప్రవేశించిందని చైనా విదేశీ, రక్షణ మంత్రిత్వ శాఖలు పేర్కొన్నాయి. ఈ కారణంగానే సిక్కిం సరిహద్దుల వద్ద వివాదం పరిష్కారం కాకుండా చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని చైనా పేర్కొంది. భారతదేశం తమ సైన్యాన్ని వెంటనే వెనుకకు పిలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/