ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని బీజేపీ బృందం మరోమారు అడ్డంగా బుక్కయ్యే సందర్భం ఇది. దేశంలో కలకలం సృష్టించిన అంశం మరో ట్విస్ట్ చేసుకుంది. మనీ లాండరింగ్ - ఎస్ బీఐ గ్రూపు బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సంచలన విషయాన్నివెల్లడించాడు. తనపై భారతీయు బ్యాంకులు వేసిన కేసులో విజయ్ మాల్యా బుధవారం లండన్ లోని వెస్ట్ మిన్ స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. అనంతరం మాల్యా మీడియాతో మాట్లాడారు. దేశాన్ని విడిచివెళ్లే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసినట్లు విజయ్ మాల్యా తెలిపాడు. ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేసేందుకు ఆర్థికమంత్రిని కలిశానని లిక్కర్ కింగ్ అన్నారు. కాగా తన ప్రతిపాదనలకు బ్యాంకులు ఒప్పుకోలేదని పేర్కొన్నాడు.
కాగా, వెస్ట్ మిన్ స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు భారత్‌కు అప్పగింత కేసులో హాజరైన మాల్యా విషయంలో ఒకవేళ విజయ్ మాల్యాను అప్పగిస్తే ఆయన్ను ఏ జైలులో వేయాలో, దాని వీడియోను పంపాలంటూ గతంలో లండన్ కోర్టు కోరింది. ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం లండన్ కోర్టుకు ఓ వీడియోను కూడా పంపించింది. మాల్యాను ఉంచాలనుకుంటున్న జైలు వీడియోను ఇవాళ కోర్టు పరిశీలించనుంది. కాగా మాల్యా తెలిపిన సమాధానం దేశవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఈ ఎపిసోడ్‌పై విపక్షాలు మండిపడ్డాయి. ప్రధానంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. బ్యాంకులకు సెటిల్ మెంట్ చేసే విషయంలో తనను కలిసినట్లుగా చెప్పిన విజయ్ మాల్యా వ్యాఖ్యలు అవాస్తవం అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశం విడిచి వెళ్లేముందు బ్యాంకులతో సెటిల్ మెంట్ విషయంలో ఆర్థికమంత్రిని కలిసినట్లుగా చెప్పిన మాల్యా వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ``రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయ్ మాల్యా సభ సమావేశాలకు ఎప్పుడో ఓసారి వచ్చేవాడు. ఓసారి సభ నుంచి బయటకు వచ్చి నా గదికి వెళ్తుండగా కారిడార్‌లో ఎదురుపడ్డాడు. అలా నడుస్తూనే బ్యాంకులతో సెటిల్‌మెంట్ ఆఫర్ చేస్తున్నట్లు చెప్పాడు. అంతే. అంతటితో నేను అతడిని ఇంకో మాట మాట్లాడనీయలేదు. ఆ విషయం గురించి నాతో మాట్లాడాల్సిన పనిలేదన్నాను. అతను చెబుతున్నట్లుగా తనకు ఏ పేపర్లను చేరలేదన్నారు. ఆ ఒక్క మాట తప్ప విజయ్ మాల్యాకు తానెప్పుడు ఆపాయింట్ మెంట్ ఇవ్వలేదు` అని ఆయన అన్నారు.