ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీతో మిత్రుత్వం కొనసాగిస్తున్న బీజేపీపై ఆ పార్టీ కేంద్ర అధిష్టానం అసంతృప్తితో ఉందా? ఏకంగా పార్టీ జాతీయ నేతలు తమ అంతర్గత సమావేశంలో వారికి తలంటారా? అంటే అవుననే అంటున్నారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి - పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్ చార్జి అరుణ్ సింగ్ పార్టీ రాష్ట్ర నేతల్ని గట్టిగా క్లాస్ తీసుకున్నారని సమాచారం.
బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ సింగ్ బీజేపీ నాయకులను మందలించారని సమాచారం. మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీ సైతం గడువులు పెట్టి బెదిరింపుల సవాళ్లు చేసినా స్పందించరా? అని తూర్పార పట్టారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి సిద్ధార్ధనాథ్ సింగ్ - రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు - ముఖ్యనేతలు - జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో అరుణ్ సింగ్ ప్రసంగిస్తూ.. విజయవాడలో తనకు ఎక్కడ చూసినా సీఎం చంద్రబాబు పెద్దపెద్ద ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయని.. ప్రధానమంత్రి మోడీ ఫ్లెక్సీ ఒక్కటీ కనిపించట్లేదన్నారు. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ఒక్కదాన్నే దోషిగా చూపేలా మిత్రపక్ష టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నేతలందరూ కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదన్న టీడీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ జాతీయ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నిధులివ్వడం లేదని టీడీపీ దుష్ప్రచారాన్ని చేస్తుందని రాష్ట్ర నాయకులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై జాతీయ నాయకులు ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. టీడీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధిష్టానం పెద్దలు సూచించారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంపై కేడర్ లో అసంతృప్తి ఉందని వారికి తెలపడంతో... జాబితాను సిద్ధం చేసి తమకు పంపాలని నేతలు అరుణ్ సింగ్ - సిద్దార్థ్ నాథ్ సింగ్ సూచించారు.