ఆ రాష్ట్రానికి ఏడాదిలో నాలుగో సీఎం

Update: 2016-12-30 11:05 GMT
బ‌ల‌హీన‌మైన నాయ‌కులు ఉన్న చోట ప్రజాస్వామ్యం ఎలా అప‌హాస్యం పాలు అవుతుంద‌నేందుకు అరుణాచల్‌ ప్రదేశ్  పాలిటిక్సే నిద‌ర్శనం. ఆ రాష్ట్రం మరోమారు రాజకీయ సంక్షోభం దిశగా పయనిస్తుంది. ఆ రాష్ట్ర సీఎం ఫెమా ఖండూ - డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికార పీపీఏ(పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ ప్రదేశ్) నిర్ణయం వెలువరించింది.

రాష్ట్ర సీఎం - డిప్యూటీ సీఎంతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి ఆరోపణలు రుజువైన కారణంగా వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నేడు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త నేతను ఎన్నుకోనున్నారు. ఆ నేపథ్యంలో మధ్యంతర ఎన్నికల సిద్ధంగా ఉండాలని అరుణాచల్‌ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సందర్భంగా తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది. నోట్ల రద్దుపై క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకతను కూడగట్టాలని నేతలు పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యంతో ఒక ఏడాదిలోనే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి పీఠంపై నాలుగో వ్య‌క్తి ఆసీనులు కానున్నారు. కాగా తాజా ప‌రిణామాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ - అటు బీజేపీ ఆచితూచి ప‌రిశీలిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News