ఢిల్లీలోని అనాజ్ మందీలోని ఓ స్కూలు బ్యాగుల తయారీ భవనంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగి 43 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఎంతో మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు పోయిన ఈ ఉదంతంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.
తాజాగా అగ్ని ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం , గాయపడ్డవారికి రూ.1 లక్ష పరిహారం అందజేస్తామని తెలిపారు.
ఇక ప్రమాదంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవన యజమాని సోదరుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. ఘటనపై మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
అగ్ని ప్రమాదం స్కూలు బ్యాగుల తయారీ కేంద్రంలో జరిగింది. అగ్నికి మొత్తం పొగ చూరడంతోనే ఊపిరి ఆడక చాలా మంది చనిపోయారని వైద్యులు తెలిపారు.
ఇక మృతుల సంఖ్య భారీగా ఉండడంపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.