ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. తనకున్న లక్షలాది కార్యకర్తల గురించి ఆలోచించే సమయమే ఉండదు. నేతల ఇళ్లల్లోజరిగే వేడుకలకు వెళ్లటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది తన కోసం.. తన పార్టీ ప్రతిఫలం ఆశించకుండా పని చేసే కార్యకర్తను పట్టించుకోవటం.. వారి గురించి ఆలోచించటం లాంటివి చేస్తారా? అంటే లేదనే మాట వస్తుంది.
అలాంటిది ఒక కార్యకర్త పుట్టినరోజు వేడుకను చేసిన సర్ ప్రైజ్ చేశారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వైరల్ కావటమే కాదు.. ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా బృందంలో పని చేస్తుంటారు వివేక్. పార్టీ కార్యకర్తగా ఉన్న అతగాడి పుట్టిన రోజు గురించి తెలిసిన కేజ్రీవాల్ వెంటనే కేక్ తెప్పించారు. దగ్గర ఉండి మరీ కేక్ కట్ చేయించారు. తాను ఎంతగానో అభిమానించే అధినాయకుడు స్వయంగా తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేయటం.. దగ్గర ఉండి కేక్ కట్ చేయించటానికి మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?
తన పుట్టిన రోజును జీవితంలో మర్చిపోలేని రీతిలో సెలబ్రేట్ చేసిన వైనాన్ని.. తాజాగా ఆప్ కార్యకర్త వివేక్ పోస్ట్ చేవారు. ఒక సాధారణ కార్యకర్తకు ఒక ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవం అంటూ అతడు మెసేజ్ పెట్టారు. దీంతో.. కార్యకర్త బర్త్ డే ను సెలబ్రేట్ చేసిన వైనం బయటకు వచ్చింది.
తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్యకర్త బర్త్ డేను సెలబ్రేట్ చేసిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను పలువురు అభినందిస్తున్నారు. దీంతో ఈ విషయం మీద స్పందించిన కేజ్రీవాల్.. పార్టీ కోసం నిస్వర్థంగా సేవ చేసే కార్యకర్తలే తమకున్న గొప్పబలమని.. కార్యకర్తలు చేసే సాయంతోనే తమ పార్టీ దేశ సేవ చేస్తుందని పేర్కొన్నారు. ఏమైనా.. ఢిల్లీ సీఎం రోటీన్ కు భిన్నం బాస్!