ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఎంత రక్షణ ఉంటుందో.. మరెంత భద్రంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అసవరం లేదు. కాకుంటే.. సంప్రదాయ రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరించే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ తాజా వ్యాఖ్యలు వింటే.. ఎంత సీఎం అయితే మాత్రం ఆయన కూడా ఆడపిల్ల తండ్రి అన్న భావన కలగక మానదు.
తన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ ఐఐటీ క్యాంపస్ నుంచి ఆలస్యంగా వస్తే.. తనకు ఆందోళనగా ఉంటుందని.. సీఎం అయిన తన పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల సంగతి మరెంతగా ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడ్డారు. నిజమే.. పరిస్థితి మార్చాలనే కదా.. సంప్రదాయ పార్టీలను వదిలేసి.. చారిత్రక విజయాన్ని కేజ్రీవాల్ కు ఢిల్లీ రాష్ట్ర ప్రజలు అందించింది. మార్చాలి.. చేయాలి.. లాంటి మాటలు వదిలేసి.. ఆచరణలో చేయాల్సింది చేసి చూపిస్తే బాగుంటుంది కదా.