కాలం కలిసి రాకపోతే అంతే. నిన్న మొన్నటి వరకూ సంచలనంగా మారిన సిద్ధూ సుడి తాజాగా తిరగటం మానేసింది. పిలిచి మరీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని సింఫుల్ గా వదిలేసి సంచలనం సృష్టించారు. పెద్దల సభలో కూర్చోబెట్టి తనను పంజాబ్ కు దూరం చేయాలని మోడీ పరివారం ప్రయత్నిస్తోందన్న ఆక్రోశాన్ని వ్యక్తం చేసి పంజాబీల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేసిన సిద్ధూ తాజా పరిస్థితి దారుణంగా ఉందట. సామాన్యుడితో కలిసి మోడీ బ్యాచ్ కు షాక్ ఇవ్వాలనుకున్న ప్రయత్నం ఆదిలోనే దెబ్బ పడిందన్న మాట వినిపిస్తోంది.
బీజేపీకి గుడ్ బై చెప్పేసి.. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయి పంజాబ్ సీఎంగా పదవిని చేపట్టాలని వేసుకున్న కలలు కల్లలైనట్లేనని చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న అంచనాలు సర్వత్రా వినిపించాయి. తొలుత పార్టీలోకి వెల్ కం చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తానని మాట చెప్పిన కేజ్రీవాల్ తాజాగా తన మనసును మార్చుకోవటం సిద్ధూకి షాకింగ్ గా మారింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో తనను బంతాట ఆడుకున్న సిద్ధూకి కేజ్రీవాల్ టైం చూసి మరీ దెబ్బేశారని చెబుతున్నారు.
తొలుత సీఎం పదవి ఆఫర్ తో సిద్ధూను ఆకర్షించి.. బీజేపీ నుంచి బయటకు తెచ్చేసి.. చివరకు హ్యాండ్ ఇచ్చారంటున్నారు. సీఎం పదవి విషయంలో ఇప్పుడు ఎలాంటి హామీ ఇవ్వకపోవటంతో సిద్ధూ పరిస్థితి క్రాస్ రోడ్ లో ఒంటరైపోయినోడి మాదిరిలా తయారైందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సిద్ధూపై కేజ్రీవాల్ టైం చూసి దెబ్బేసినట్లుగా చెబుతున్నారు. ఎప్పుడూ దగ్గుతూ ఉండే కేజ్రీవాల్ కు రోగం నయమయ్యేదెప్పుడో.. ఢిల్లీ ప్రజలకు పాలన దొరికేదెప్పుడో అంటూ సెటైర్లు విసిరిన సిద్ధూను రెండింటికి చెడ్డ రేవడిలా చేయటంలో కేజ్రీవాల్ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. పంజాబ్ సీఎం పదవికి అభ్యర్థిగా ప్రకటించేందుకు ఓకే అన్న కేజ్రీవాల్ హామీతో .. తన రాజ్యసభ పదవికి.. పార్టీకి సిద్ధూ రాజీనామా చేశారు. రాజీనామా ఎపిసోడ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయిన తర్వాత కేజ్రీవాల్ ఇప్పుడు మాట మార్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు సిద్ధూను ఒప్పుకోవటం లేదంటూ సింఫుల్ గా తేల్చేయటంతో సిద్ధూ రెండింటికి చెడ్డ రేవడిగా మారారు. సిద్ధూ ఎపిసోడ్ తో స్పష్టమయ్యేదేమంటే.. ‘‘సామాన్యుడు’’ సామాన్యుడు కాదనే.