రాజకీయాల్లో విరుద్ధ భావజాలం ఉన్న నేతలు మామూలే. ప్రధాని మోడీ తీరును ఏమాత్రం ఒప్పుకోకుండా.. ఆయనపై నిత్యం విమర్శలు చేస్తూ.. ఆయన తీసుకున్న నిర్ణయాల్ని తప్పు పట్టే ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తయారు చేస్తే.. మొదటి మూడుస్థానాల్లో నిలుస్తారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రదాని మోడీని తప్పు పట్టే విషయంలో ఏ సందర్భంలోనూ ఆయన వెనక్కి తగ్గరు.
రాజకీయంగా మోడీని అంతగా విభేదించే కేజ్రీవాల్.. వ్యక్తిగతంగా మాత్రం మోడీ ఇచ్చిన సలహాను తూచా తప్పకుండా పాటించటం విశేషం. విపరీతమైన దగ్గు.. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడే కేజ్రీవాల్ అవస్థను గుర్తించిన ప్రధాని మోడీ.. గతంలో ఆయనకు బెంగళూరులోని ప్రకృతి వైద్యం గురించి సూచనలు చేసి.. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని చెప్పటం తెలిసిందే. అలా వెళ్లిన ఆయన ఆరోగ్యం కుదురుపడింది.
తాజాగా మరోసారి ప్రకృతి వైద్యం చేయించుకునేందుకు పది రోజులు సెలవు తీసుకొని బెంగళూరు వైద్యానికి వెళ్లనున్నారు. బెంగళూరు శివార్లలో ఉండే జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ లో మరోసారి ఆయన వైద్యం చేయించుకోనున్నారు. గత మార్చిలోనూ ఆయన కొన్ని రోజులు ఇక్కడే వైద్యం తీసుకున్నారు.