ఢిల్లీలో హై అలర్ట్.. ఏ నిమిషంలో ఏం జరిగింది

Update: 2016-02-18 12:06 GMT
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి వరుసగా జెఎన్ యూ సంఘటనకు సంబంధించి నిరసనలు, కేసులు - ఫిర్యాదులు విచారణలతో హస్తిన వేడెక్కింది. పాటియాలా హౌస్ కోర్టు వద్ద నిన్న జరిగిన హింసాకాండలో ఒక న్యాయవాదిపై లాయర్ల దుస్తులలో ఉన్న గుంపు దాడి చేసిన సంఘటనపై ఢిల్లీ పోలీసులు ఈ మధ్యాహ్నం కేసు నమోదు చేశారు. జెఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ కుమార్ కు మద్దతుగా మాట్లాడుతుండగా ఆ న్యాయవాదిపై దాడి జరిగింది. రెండు గంటల ప్రాంతంలో పాటియాలా కోర్టు వద్ద నిన్న జరిగిన సంఘటనల పట్ల బార్ కౌన్సిల్ విచారం వ్యక్తం చేసింది. జర్నలిస్టులపై దాడి సంఘటనను తీవ్రంగా ఖండించిన బార్ కౌన్సిల్ ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న న్యాయవాదులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జర్నలిస్టులపై నిన్న జరిగిన దాడికి విచారం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా జరిగిన సంఘటన పట్ల వారికి క్షమాపణ తెలిపారు.

- మధ్యాహ్నం రెండు గంటల నుంచీ మండీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో మండీ హౌస్ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. రెండున్నరకు ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అనంతరం రాజ్ భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు.

- 2.35 గంటలకు మండీ హౌస్ నుంచి విద్యార్థుల ర్యాలీ ప్రారంభమైంది.

- 2.45 గంటలకు ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నందితా నారాయణ్ ర్యాలీలో పాల్గొన్నారు.

- 2.50 నిముషాలకు జెఎన్ యూ ప్రొఫెసన్ ఎస్ ఎఆర్ గిలానీని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా భద్రతా కారణాల రిత్యా కేసు కేసు విచారణ ఇక్కడ కాకండా మరో చోటకి మార్చాలని నిర్ణయించారని ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ కుమార్ సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ట్రయల్ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేయలేదని ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.

- 2.52 గంటలకు కన్హయ కుమార్ బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Tags:    

Similar News