మోడీకి కార్టూన్ తో పంచ్ విసిరిన సీఎం

Update: 2018-05-29 06:09 GMT
వేలాది మాట‌ల్లో చెప్ప‌లేని భావ‌న‌ను ఒక చిన్న చిత్రంతో చూపించొచ్చు. అదే చిత్రానికి ఉన్న బ‌లం. ఇక‌.. వ్యంగ్య చిత్రాల‌తో పాల‌కుల వెన్నులో చ‌లి పుట్టించే గుణం కార్టూన్ సొంతం. తాజాగా అలాంటి చురుకునే పుట్టించిందో కార్టూన్.  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాలుగేళ్ల పాల‌న‌ను ఒక చిన్న‌కార్టూన్ తో పంచ్ వేసిన సీఎం ఉందంతం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మోడీ నాలుగేళ్ల పాల‌న‌పై ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ట్విట్ట‌ర్లో ఆయ‌న ఒక కార్టూన్ ను పోస్ట్ చేశారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి హోదాలో నాలుగేళ్ల కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలో తానేం చేశానో చెప్పుకున్న ఆయ‌న‌.. మోడీ ఏం చేయ‌లేదో చెప్పుకున్నారు.

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ స‌ర్కార్ ఢిల్లీ రాష్ట్రంలో విద్య‌.. ఆరోగ్యంతో స‌హా ప‌లు విబాగాల్లో ప్ర‌గ‌తి ప‌థంలోకి దూసుకెళుతున్న వైనాన్ని చూపించ‌గా.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క విష‌యంలోనూ స‌రైన ఫ‌లితాన్ని చూపించ‌లేద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

త‌క్కువ ధ‌ర‌కే విద్యుత్‌.. ఉచిత నీటి స‌ర‌ఫ‌రా.. ఉచిత వైద్యం.. ఆధునాత‌న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు.. మొహ‌ల్లా క్లినిక్ ఇలా తాము సాధించిన విజ‌యాల్ని కార్టూన్ లో ఏక‌రువు పెట్టిన కేజ్రీవాల్‌.. త‌మ విజ‌యాల్ని ఓ ఆకాశ హ‌ర్మ్యంలా చూపించారు. అదే కార్టూన్ లో భారీ భ‌వ‌నం ప‌క్క‌న బీడు బారిన ఓ స్థ‌లంలో స‌రిహ‌ద్దులు క‌ట్టిన‌ట్లు.. పునాదుల మ‌ధ్య‌న ఒక బోర్డు పెట్టిన‌ట్లుగా ఉంచారు. క‌మ‌లం గుర్తును ఆ బోర్డు మీద ఉంచి.. నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి అంటూ రాసి ఉంచారు. మోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ప్ర‌భావం చూపించేలా ఉన్న ఈ కార్టూన్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డ‌టం ఎలానో కేజ్రీవాల్ చూపించిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మోడీ వ్య‌తిరేకులంతా ఒక్కొక్క‌రిగా కార్టూన్ తో విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తారేమో?
Tags:    

Similar News