ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా మరోసారి కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీలో కేంద్రం పెత్తనం ఏంటని పదేపదే ప్రశ్నించే ఈ సీఎం కాని సీఎంకు ఇదొక సమాధానం లభించని ప్రశ్న! గత కొన్నాళ్లుగా తనకు, తన ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ప్రధాని మోడీపై విరుచుకుపడే ఈ కేజ్రీ.. ఇప్పుడు మరింత క్రేజ్ గా ఫైరైపోయారు. తనపై కుట్ర పన్నారని మోడీతో డైరెక్ట్ గా ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. తన ప్రభుత్వంలోని మంత్రులపై లేనిపోని కేసులు బనాయిస్తున్నారని, తన కార్యాలయంపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారని పదేపదే వాపోయే కేజ్రీ.. ఇప్పుడు మరో కేసులో తన మంత్రి ఇరుక్కోవడంతో కేంద్రం చేస్తున్న కుట్ర చిట్టాను ప్రజలకు వివరిస్తానని శపథం చేశారు. దీనికిగాను ఆయన ఢిల్లీ అసెంబ్లీని ఒక్కరోజు పాటు శుక్రవారం సమావేశ పరుస్తున్నారు.
కేజ్రీవాల్ మీద - మంత్రుల మీద - ఆప్ ఎమ్మెల్యేల మీద తప్పుడు ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయడంపై అసెంబ్లీని ఒకరోజు ప్రత్యేకంగా సమావేశపచరాలని ఢిల్లీ మంత్రివర్గం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఢిల్లీ మహిళా కమిషన్ లో అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఏసీబీ మొదలుపెట్టిన విచారణలో భాగంగా ముఖ్యమంత్రి పేరును కూడా ఎఫ్ ఐఆర్ లో నమోదు చేశారు. దీంతో ఈ ఘటన కేజ్రీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మరోపక్క - కేజ్రీకి అత్యంత ఆప్తుడు - మంత్రి సత్యేంద్రజైన్ పై ఆదాయపు పన్నుశాఖ హవాలా కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడమే కాకుండా హవాలా మార్గంలో నిధులు సమీకరించారని పేర్కొంటూ వచ్చే నెల నాలుగున జరిగే విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆయనను ఆదేశించింది.
దీంతో కేజ్రీ మరింత రెచ్చిపోయారు. ఇవన్నీ కేవలం తమను ఇరుకున పెట్టేందుకే మోడీ ఆడుతున్న డ్రామాలుగా ఆయన ఆరోపించారు. తాను సత్యేంద్ర జైన్ ను పిలిపించి పత్రాలన్నీ చూశానని, ఆయన నిర్దోషి అని కేజ్రీ తెలిపారు. అంతేకాకుండా.. ఆయన తప్పు చేసి ఉంటే ఎప్పుడో బయటకు పంపేసేవాళ్లమని, ఆయన అలాంటి వాడు కాదని, అందుకే ఇప్పుడు మాత్రం ఆయనకు అండగా ఉంటామని వివరించారు. ఈ మేరకు ఆయా ఘటనపై స్పందిస్తూ.. ట్విట్టర్‌లో కామెంట్లు చేసిన కేజ్రీ.. తమ ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని అన్నారు. అయితే, ఆ కుట్ర ఏంటనేది శుక్రవారం నాటి అసెంబ్లీలోనే వెల్లడిస్తానని చెప్పారు. మరి కేజ్రీ ఏం వెల్లడిస్తారు? మోడీతో నేరుగా తలపడే క్రమంలో ఎలాంటి ఆయుధాలు వాడతాడు? అనేది మరో 24 గంటల్లో తెలిసిపోనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/