బ్రిటన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మైనపు విగ్రహం తయారు కానుంది. భారతదేశానికి చెందిన ఓ ముఖ్యమంత్రి మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్సలో ఉంచడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ఇండియాకు చెందిన ప్రముఖులు మహత్మ గాంధీ - ఇందిరా గాంధీ - అమితాబ్ -షారుఖ్ ఖాన్ -సల్మాన్ ఖాన్ - ఐశ్వర్య రాయ్ - కరీనా కపూర్ -మాధురీ దీక్షిత్ - హృతిక్ రోషన్ - సచిన్ టెండూల్కర్ విగ్రహాలు అక్కడ ఏర్పాటయ్యాయి. ఆ తరవాత ఇపుడు అరవింద్ క్రేజివాల్ మైనపు బొమ్మను పెడుతున్నారు.
ఈ మేరకు అరవింద్ క్రేజివాల్ తో భేటి అయ్యేందుకు మేడమ్ టుస్సాడ్ ట్రస్ట్ సభ్యులు వచ్చే నెల ఢిల్లీ వస్తున్నారు. ఇప్పటి వరకు యూరప్ , ఇతర దేశాల్లో 20 మేడమ్ టుస్సాడ్ ఆఫీసులు ఉన్నాయి.మనదేశంలోనూ ఏర్పాటు చేయనున్నారు.భారత్ కు చెందిన విజ్ క్రాఫ్టు ఎంటర్ టైన్ మెంట్ ఇంటర్నేషనల్ సహకారంతో ఢిల్లీ లో మేడమ్ టుస్సాడ్ మ్యూజియం పెడుతున్నారు. బహుశా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అందులోనూ కేజ్రీవాల్ బొమ్మను ఉంచుతారని తెలుస్తోంది.