ఆమ్ ఆద్మీ పార్టీ లోగో మారింది. కాషాయం, ఆకుపచ్చ రంగులుండే లోగో స్థానంలో నీలంరంగు చిహ్నం వచ్చింది. పార్టీ కార్యకర్త ఒకరు పాత లోగోపై హక్కులు తనవంటూ... ఆ లోగా మార్చేయాలని కోరిన నేపథ్యంలో ఈ మార్పు చేశారు. ఆప్ అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఇప్పుడు కొత్త లోగోయే కనిపిస్తోంది. అయితే ఆప్ వెబ్ సైట్ లో మాత్రం ఇంకా పాతలోగోయే ఉంది.
ఆప్ ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మార్పు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.... వాస్తవం మాత్రం లోగో హక్కులపై చోటుచేసుకున్న వివాదమే కారణమని తెలుస్తోంది. ఆప్ గతంలో వాడిని లోగోను సునీల్ లాల్ అనే కార్యకర్త డిజైన్ చేశారు. దాని రైట్స్ ఆయనకే ఉన్నాయి. ఆప్ వంద రోజుల పాలన సందర్భంగా గత నెలలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆసునీల్ లాల్ లోగో రూపొందించిన తాను దాని హక్కులను ఎవరికీ ఇవ్వదలచుకోలేదని చెప్పడంతో పాటు పార్టీ ఆ లోగోను ఏ విధంగానూ ఉపయోగించకూడదని డిమాండ్ చేశారు. పార్టీ కరపత్రాలపై కానీ, అధికారిక వెబ్ సైట్ లో కానీ వినియోగించరాదని కోరారు, ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ కూడా రాశారు. దీంతో కేజ్రీవాల్ సూచన మేరకు ఇప్పుడు లోగోను మార్చేశారు.