షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం రిమైండ్ ఖాదీగా జైల్లో ఉంటున్నాడు. కోర్టుల్లో అతడి బెయిల్ పిటీషన్ కొట్టుడుపోతోంది. ముంబై హైకోర్టులోనూ ఇటీవల చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానాలు నిరాకరిస్తున్నాయి.
ఇప్పటికే పలుమార్లు ఆర్యన్ కు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. అయితే ఇప్పుడు బెయిల్ రాకపోతే మరో మూడు రోజులు ఆర్యన్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. కోర్టుకు దసరా, వీకెండ్ హాలీడేస్ కావడంతో మళ్లీ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగే అవకాశం ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు బెయిల్ ఇస్తుందా? తిరస్కరిస్తుందా? అన్నది బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
నిన్న ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై ముంబై ఎన్.డీపీఎస్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్ కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ వాదిస్తోంది. అయితే ఆర్యన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదని.. బెయిల్ ఇవ్వాలంటూ ఆర్యన్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదని.. అయితే క్రూయిజ్ లో డ్రగ్స్ పార్టీ కుట్రలో భాగస్వామిగా ఉన్నాడని ఎన్సీబీ కోర్టుకు స్టేట్ మెంట్ లో సమర్పించింది.
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ తో ఆర్యన్ కు సంబంధాలున్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించింది ఎన్సీబీ. ఈ కేసులో ఆర్యన్ ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని..అందుకే కస్టడీ పిటీషన్ దాఖలు చేశామని తెలిపింది.