బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విషయం తెల్సిందే. గత నెల రోజులుగా ఆర్యన్ జైల్లోనే ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ముంబయి హైకోర్టులో మూడు సార్లు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నాడు. ఎన్ సీ బీ అధికారులు తీవ్రంగా బెయిల్ కు ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో కోర్టు వారి వాదనలను సమర్థిస్తూ బెయిల్ మంజూరు చేయడం లేదు. ఎన్ సీ బీ అధికారులు విచారణ సమయంలో ఆర్యన్ కు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కేసు నీరుగారి పోతుందంటూ వాదిస్తున్నారు. దాంతో కోర్టు వారి వాదనలతో ఆర్యన్ బెయిల్ పిటీషన్ ను మూడు సార్లు కొట్టి వేయడం జరిగింది. దాంతో నాల్గవ సారి కూడా ఆర్యన్ బెయిల్ పిటీషన్ వేయడం జరిగింది. నేడు బెయిల్ పిటీషన్ కు సంబంధించిన తీర్పును కోర్టు వెళ్లడించబోతుంది.
ఒక వేళ నేడు కూడా ఆర్యన్ కు బెయిల్ రాక పోతే మరిన్ని కష్టాలు తప్పవు అంటూ న్యాయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈనెల చివరి నుండి వచ్చే నెల 13 వరకు కోర్టుకు దీపావళి హాలీడేస్ ఉన్నాయి. దాంతో సెలవుల్లో కోర్టు పని చేయదు.. కనుక బెయిల్ పిటీషన్ వేయడానికి ఉండదు. మళ్లీ వచ్చే నెల 14 లేదా 15 వరకు బెయిల్ పిటీషన్ వేయలేని పరిస్థితి. బెయిల్ పిటీషన్ వేసిన తర్వాత విచారణకు వచ్చి ఒక వేళ బెయిల్ మంజూరు అవ్వడంకు నవంబర్ 20 వరకు అయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. నేడు కనుక ఆర్యన్ కు బెయిల్ మంజూరు కాకుంటే మరో నెల రోజుల పాటు ఆర్యన్ జైల్లోనే ఉండాల్సి రావచ్చు అంటున్నారు. ఎన్ సీ బీ అధికారులు ఈ కేసులో ఆర్యన్ ను వేదిస్తున్నారు అంటూ షారుఖ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్యన్ బెయిల్ పిటీషన్ లు మళ్ల ఈ మళ్లీ కొట్టివేయబడ్డ నేపథ్యంలో షారుఖ్ స్వయంగా జైలుకు వెళ్లి కొడుకును చూసుకుని వచ్చాడు. ఆ సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎమోషనల్ అయ్యారట. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ను వదిలిపెట్టేందుకు షారుఖ్ నుండి ఎన్ సీ బీ అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి షారుఖ్ ఖాన్ డబ్బులు ఇవ్వక పోవడం వల్లే ఆర్యన్ ఖాన్ ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు అన్నాడు. ఎన్ సీ బీ అధికారులు బెయిల్ పిటీషన్ కు వ్యతిరేకంగా తమ వాదన వినిపించడంకు కారణం కూడా అదే అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది కాలమే తేల్చాలి.