ఐటీ ఉద్యోగులకు కష్టాలేనట

Update: 2017-02-06 10:15 GMT
భారత్ లో ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం ఎదురుకానుందట. ఎవరో.. కాదు, సాక్షాత్తు ప్రపంచబ్యాంకే ఈ సంగతి చెబుతోంది.  దీనిపై ప్రత్యేక రిపోర్టు కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది, విద్య ఉంటే ఎక్స్ పీరియన్స్ లేదని, ఎక్స్ పీరియన్స్ ఉంటే స్కిల్స్ లేవంటూ ఐటీ కంపెనీలు మెలికలు పెడుతున్నాయి. తాజాగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుతో, దేశీయ ఐటీ దిగ్గజాలు సైతం ఆత్మరక్షణలోకి జారుకుంటున్నాయి. ఉద్యోగుల సంఖ్య కంటే కూడా ఆటోమేషన్ పైనే కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. బీపీవో సేవల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో  ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి రావొచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగుల్లో ఏడుగురికి కష్టకాలం తప్పదని అంటున్నారు.
    
కాగా ఇండియన్ ఐటీ ఇండస్ర్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఈ రిపోర్టు తెలిపింది. టీసీఎస్ - విప్రోలాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు అవసరమైతే జీతాలు పెంచి, టెక్నాలజీ పరంగా వారికి మరిన్ని బాధ్యతలను అప్పగించాలని ఈ సంస్థలు భావిస్తున్నట్టు తెలిపింది.
    
ఈ నేపథ్యంలో, మొత్తమ్మీద ఇండియాలోని ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అభిప్రాయపడింది. ఆటోమేషన్ విధానం అమల్లోకి వస్తే, ఎంటెక్ - బీటెక్ లు పూర్తి చేసుకుని వచ్చే ఇంజినీర్లకు ఉద్యోగాలు దొరకడం దుర్లభంగా మారుతుందని వరల్డ్ బ్యాంకు రిపోర్టు తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News