ప్రధానికి పదవి పోయినా.. పిల్లికి మాత్రం పోలేదు

Update: 2016-07-13 22:30 GMT
ప్రధాని ఏంటి? పిల్లి ఏంటి? ప్రధానికి పదవి పోతే.. పిల్లికి మాత్రం ఉద్యోగం ఏమిటి? ప్రధానికి.. పిల్లికి మధ్య లింకేమిటంటూ చాలానే ప్రశ్నలు రావటంసహజం. కానీ.. మేం చెబుతున్నది బ్రిటన్ ప్రధాని కామెరన్ అధికారిక నివాసంలోని పిల్లి గురించి. ఐతే.. సో వాట్? అంటారా.. అయితే.. విషయాన్నిమొదటి నుంచి చెప్పాల్సిందే.

దాదాపు ఐదేళ్ల క్రితం.. బ్రిటన్  ప్రధాని అధికారిక నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ లోనికార్యాలయంలో ఎలుకల బెడద ఓ రేంజ్ లో ఉన్న పరిస్థితి. ఈ ఎలుకల గోల ఎంత పీక్ స్టేజ్ కి వెళ్లిందంటే.. ఏదైనా ముఖ్యమైన సమావేశం సమయంలోనూ ఎలుకలు సినిమా చూపించేవి. దీంతో.. ఎలుకల అంతు చూసేందుకు లండన్ లోని కుక్కలు.. పిల్లుల సంరక్షణ సంస్థ నుంచి ల్యారీ అనే పిల్లిని తీసుకొచ్చారు.తెలుపు.. గోధుమ రంగుతో నల్లటి చారలతో ముద్దుగా ఉండే ఈ పిల్లి తనకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేయటమే కాదు.. డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రధాని నివాసం దరిదాపుల్లోకి ఎలుకలు రావటానికి సైతం వణికిపోయేలాచేసింది.

దీంతో.. బ్రిటన్ వ్యాప్తంగా ల్యారీ ఫుల్ ఫేమస్ అయిపోయింది. డౌనింగ్ స్ట్రీట్లోని క్యాబినెట్ కార్యాలయం వద్ద విలాసంగా తోక ఊపుకుంటూ కెమేరాలకు..వీడియోలకు ఫోజులిచ్చే ఈ పిల్లి వ్యవహారం మీద ఇప్పుడు చాలానే డౌట్స్ వచ్చేశాయి. ఎందుకంటే.. ఈ మధ్యన నిర్వహించిన బ్రెగ్జెట్ లో కామెరన్ అనుకున్న దానికి భిన్నంగా ప్రజాతీర్పు రావటంతో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించటం.. అందుకు తగ్గట్లే తన పదవికి రాజీనామా చేస్తుండటంతెలిసిందే.

మరి.. ప్రధానిగా కామెరన్ పదవి పోతున్న వేళ.. ఆయన హయాంలో తీసుకొచ్చిన ల్యారీ ఉద్యోగం కూడా పోతుందని అందరూ ఆశించారు. అయితే..అందరి అంచనాలకు భిన్నంగా.. ప్రధాని కార్యాలయంలో ల్యారీ సేవలు అవసరమని.. తర్వాతి ప్రధాని హయాంలో కూడా వాటిని కొనసాగించాలని డిసైడ్ చేశారు. పిల్లికి చీఫ్ మౌసర్ గా పోస్టింగ్ ఇచ్చేశారు. కామెరాన్ తర్వాత ప్రధాని పదవిని చేపట్టనున్న థెరిసా హయాంలో కూడా ల్యారీ తన విధుల్నికొనసాగించొచ్చని డిసైడ్ చేశారు. సో.. ప్రధాని.. పిల్లి లొల్లి  ఇప్పుడు అర్థమైందా?
Tags:    

Similar News