అల్లర్లకు దిగేవాళ్లకు దడ పుట్టించిన యోగి

Update: 2018-01-31 16:32 GMT
దేశభక్తిని - జాతీయవాదాన్ని సమర్థించేవారిని వ్యతిరేకించడం.. వారి చర్యలను తప్పుపట్టడం - నిలదీయడం.. అలా వ్యతిరేకించేవారికి మద్దతివ్వడం ఇటీవల కాలంలో భారతదేశ మీడియాకు ఫ్యాషన్‌గా మారింది. నిజానిజాలు ఏవీ తెలుసుకోకుండానే భాజపా వ్యతిరేకులు చేసే ఆరోపణలకు, వ్యాఖ్యలకు వంతపాడే మీడియా ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే సంఘ విద్రోహశక్తులు - అల్లరిమూకలకు - టెర్రరిస్టు కార్యకలాపాలకు దక్కే ప్రయారిటీ వారిని అణచివేసే ఘటనలకు దక్కడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన పరిణామాలు.. దాన్ని ఎదుర్కొనడంలో అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ చూపిన వేగం మీడియా తక్కువగానే చూపింది. అదేసమయంలో ఉత్తరప్రదేశ్ లో ఏ ఇంటికైనా కాషాయ రంగు కనిపిస్తే అది యోగీనే వేయించాడనే వార్తలు మాత్రం ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకొస్తోందంటే.. ఉత్తర్ ప్రదేశ్ లోని కాస్‌ గంజ్‌ లో జరిగిన పరిణామాల అనంతరం నిందితులను పట్టుకోవడంలో యూపీ గవర్నమెంటు చూపిన వేగం ఏ ప్రభుత్వానికైనా ఆదర్శమేనని చెప్పాలి.
    
మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా భారత్ మాతాకీ జై - వందేమాతరం అంటూ నినదించిన జాతీయవాదులపై జాతివ్యతిరేక మూకలు కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో చందన్ గుప్తా అనే యువకుడు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం జాతివ్యతిరేక శక్తులు కొన్ని కాస్ గంజ్‌ లో అల్లర్లకు పాల్పడ్డాయి.
    
ఇది జరిగిన వెంటనే యోగి చాలావేగంగా స్పందించి ఒక ఐజీ స్థాయి అధికారి సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులను కాసర్ గంజ్ పంపించారు. అల్లర్లకు పాల్పడినవారు కాస్ గంజ్ నుంచి పారిపోకుండా కాస గంజ్ చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును మోహరించారు. భారీ ఎత్తున డ్రోన్లను - కెమేరాలను - సీఐడీ అధికారులను రంగంలోకి దించి ఇల్లిల్లూ వెతికి 48 గంటల్లేనే 81 మంది నిందితులను పట్టుకున్నారు. తాజాగా  చందన్ గుప్తా హత్యకేసులో ప్రధాన నిందితుడైన సలీంను కూడా పట్టుకున్నారు.  మత కల్లోలాలు - అల్లర్లు జరిగిన సందర్భాల్లో ఇంత వేగంగా స్పందించడం - చర్యలు తీసుకోవడం ఉత్తర ప్రదేశ్ చరిత్రలోనే తొలిసారట.
Tags:    

Similar News