అనుకున్నట్టే.. నితిన్ కుటుంబానికి బీజేపీ టికెట్.. ఎవరికిస్తున్నారంటే?

Update: 2022-09-24 04:45 GMT
ప్రముఖ తెలుగు హీరో నితిన్ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలుసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం సినిమాల్లో మాత్రమే నటించిన నితిన్ ఒక్కసారిగా ఏకంగా నడ్డాను కలవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. నితిన్ రాజకీయాల్లోకి వస్తున్నాడా..? లేక బీజేపీలో చేరి ఏదైనా పదవిని పొందుతారా..? అనే ఆసక్తి చర్చ సాగింది. అంతేకాకుండా బీజేపీ నాయకులు మరో హీరో నిఖిల్ ను పిలవబోయిన నితిన్ పొరపాటున పిలిచారని కొందరు ఎద్దేవా చేశారు. ఇలా కొంత కాలం మీడియాలో సస్పెన్స్ థ్రిల్లింగ్ గా సాగిన ఈ న్యూస్ కు తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తాము పొరపాటున నిఖిల్ ను పిలవబోయి నితిన్ పిలవలేదని, నితిన్ ను స్వయంగా పిలిచామని కమలం నాయకులు వివరణ ఇచ్చారు. మరి నితిన్ బీజేపీ నాయకులను ఎందుకు కలిసినట్లు..? ఆయన నిజంగానే పార్టీలోకి చేరుతున్నారా..? మరి ఎవరు చేరుతున్నారు..?

తెలంగాణలో పార్టీని బలపరిచేందుకు బీజేపీ అనేక వ్యూహాలను పన్నుతోంది. ఇందులో భాగంగా పార్టీలో క్యాడర్ ను పెంచుకునేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. చేరికల కమిటీ కన్వీనర్ గా  ఈటల రాజేందర్ ను నియమించిన విషయం తెలిసిందే. తనకు పెద్ద బాధ్యతను ఇచ్చారని ఇప్పటికే చెప్పిన ఈటల అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచే కాకుండా సినీ ఇండస్ట్రీ నుంచి కొంత మంది ప్రముఖులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. వారికి భారీ ఆఫర్లు ప్రకటించి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే నితిన్ ను పిలిచినట్లు సమాచారం.

అయితే నితిన్ బీజేపీ నాయకులను కలిసింది ఆయన పార్టీలో చేరడానికి కాదు. ఆయన సొదరి నిఖితా రెడ్డి కోసం అని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నిఖితా రెడ్డి ఇప్పికే నిర్మాతగా కొన్ని సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి  రావాలని చూస్తున్నట్లు సమాచారం. ఎప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆమెకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఓ ఆఫర్ ను బీజేపీ నాయకులు ఆమె ముందు ఉంచినట్లు సమాచారం. ఇప్పుడిప్పడే ఫాంలోకి వస్తున్న బీజేపీ నుంచి ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్ లో కాస్ట్లీ ఏరియాగా పేరున్న జూబ్లిహిల్స్ నుంచి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. జూబ్లిహిల్స్ లో ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా హీరో నితన్ తండ్రి కూడా పేరున్నడిస్ట్రి బ్యూటర్.

ఇవన్నీ కలిసొచ్చే అవకాశం ఉన్నందున నిఖితా రెడ్డికి జూబ్లిహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీలో ఆ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల సంగతేంటి..? అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఇదే ఫైనల్ బీజేపీ నాయకులు నిర్ణయానికి రాలేదని, అప్పటి వరకు ఆలోచన మారొచ్చని అంటున్నారు.

ఏదీ ఏమైనా నిఖితా రెడ్డికి టికెట్ వస్తే మాత్రం సినీ ఇండస్ట్రీని కూడా బీజేపీ వైపు తిరుగుతుందా..? అని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖు సినీ ఇండస్ట్రీ నుంచి బీజేపీలో చేరి మంచి మంచి పదవులు ఆశించారు. ఇటీవల మరణించిన కృష్ణం రాజు సైతం కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఒకవేళ బీజేపీలో చేరి టికెట్ రాకపోయినా అందులో కొనసాగితే ఏదో ఒక పదవి వస్తుందనే ఆశతో బీజేపీలోకి చేరాలని చూస్తున్నట్లు సమాచారం. మరి ఎన్నికల వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News