తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన షర్మిల కొత్త పార్టీకి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. గడిచిన కొద్ది రోజులుగా లోటస్ పాండ్ ను అడ్డాగా చేసుకొని సభలు.. సమావేశాలు నిర్వహిస్తున్న ఆమె.. వచ్చే నెల తొమ్మిదిన ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకోవటం తెలిసిందే. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళలో.. భారీ సభకు పోలీసుల అనుమతి వస్తుందా? అన్నది సందేహంగా మారింది.
ఇలాంటి వేళ.. టెన్షన్ తీరేలా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. షర్మిల నిర్వహించాలని భావిస్తున్న సభకు అనుమతిని ఇచ్చేశారు. ఏప్రిల్ తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పెవిలియన్ గ్రౌండ్స్ లో షర్మిల సభను నిర్వహించుకోవచ్చని చెప్పారు.
ఈ గ్రౌండ్ లో ఐదారు వేల మంది వరకు సభకు వచ్చేందుకు వీలుగా అనుమతులు ఇచ్చారు. ఈ సభ నుంచే షర్మిల తన కొత్త పార్టీ పేరును.. జెండా.. ఎజెండాతో పాటు విధివిధానాల గురించి ప్రకటించే వీలుంది. నిన్నటి వరకు షర్మిల సభపై నెలకొన్న సందేహాల్ని పోలీసులు తీర్చేశారని చెప్పాలి. అయితే.. సభకు మరో రెండు వారాల సమయం ఉండటం.. ఈ లోపు కరోనా కేసుల నమోదు మరింత ఎక్కువ అయిన పక్షంలో.. పోలీసుల నిర్ణయం మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.