కరోనా పుణ్యమా అని.. గత ఏడాది కీలకమైన పండుగలన్ని సాదాసీదాగా పూర్తి చేయటం తెలిసిందే. ఘనంగా జరుపుకునే పండుగల్ని ఇంటి పట్టునే పూర్తి చేసుకోవటం తెలిసిందే. కాలచక్రంలో ఏడాది తిరిగిన తర్వాత కూడా మళ్లీ కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఆయా ప్రభుత్వాలు అలెర్టు అవుతున్నాయి. పది రోజుల క్రితం వరకు కూడా కేసుల నమోదు తక్కువగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా రోజుకు 40వేల కేసులకు పైనే నమోదవు కావటం ఆందోళన కలిగిస్తోంది.
దీంతో.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల లాక్ డౌన్ విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాత్రివేళలో కర్ఫ్యూలు విధించాలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ విధించే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 28న హోలీ ఉండటం.. ఉత్తరాదిన ఈ పండుగను ఘనంగా నిర్వహించుకునే వీలుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించేందుకు రెఢీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్నిచోట్ల అయితే.. హోలీ రోజు నుంచి తర్వాతి రెండు రోజులు ఆంక్షలు విధిస్తే వైరస్ వ్యాప్తిని చెక్ పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ రోజున లాక్ డౌన్ మీద ఢిల్లీ సీఎం నిర్ణయం తీసుకునే వీలుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకున్నా.. పాక్షికంగా అయినా ఆంక్షలు విధిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. స్కూళ్లు.. హాస్టల్స్ మూసివేతతో పాటు.. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకుంటే తప్పించి.. కేసుల నమోదు ఆగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.