ప్రతి విషయంలోనూ తప్పులు వెతకటం కొంతమంది చేస్తుంటారు. ఇక.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆయన మాటలు ప్రతిదీ మైనార్టీల భావోద్వేగాల్ని స్పృశించేలా ఉంటాయే తప్పించి.. సమాజం మొత్తం సంక్షేమానికి సంబంధించి ఉండవు. ప్రతి విషయానికి మైనార్టీల విషయంలో అయితే ఇలా జరుగుతుందా? అంటూ ప్రశ్నలు వేస్తారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలు అసదుద్దీన్ నే అందరూ సంధించాల్సి ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. నడిరోడ్డు మీద ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ను కారులో నుంచి బయటకు గుంజి.. లాగి పెట్టి కొట్టినా అరెస్ట్ కాకుండా ఉండటం.. ఆ పక్కరోజే దర్జాగా వేరే రాష్ట్రానికి వెళ్లి మరీ ఎన్నికల ప్రచారం చేయటం ఈ దేశంలో మరే రాజకీయ నాయకుడికి సాధ్యం అవుతుంది?
తాజాగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంలో శిక్ష పడి.. జైలు జీవితాన్ని అనుభవించి.. జైల్లో సత్ప్రవర్తన కారణంగా కాస్త ముందుగా విడుదలైన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పై మజ్లిస్ అధినేత అసద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒకవేళ సంజయ్ పేరు కానీ.. సిద్దిఖీ బాబా అయి ఉంటే ఫలితం ఇలానే ఉండేదా? అని ఆయన ట్వీట్ చేయటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్ట్ రాణా అయూబ్ చేసిన ట్వీట్ ను ఉదహరిస్తూ అసద్ ఇలా రియాక్ట్ అయ్యారు. 1993లో బాంబు పేలుళ్ల కేసులో మిగిలిన నిందితులంతా జీవితకాల శిక్ష ఎదుర్కొంటుంటే.. సంజు మాత్రం ఘనస్వాగతం అందుకున్నారు.. ఇది వంచన’’ అంటూ ఆ జర్నలిస్ట్ మహాశయుడు ట్వీట్ చేశాడు. కాకపోతే.. సదరు జర్నలిస్ట్ కి బుర్రలో గుజ్జు కాస్త తక్కువని చెప్పాలి. ఎందుకంటే.. సంజయ్ దత్ అరెస్ట్ అయ్యింది 1993 ముంబయి పేలుళ్ల కేసులో కాదు.. అక్రమ ఆయుధాల కేసులో. కాకుంటే.. ముంబయి పేలుళ్ల సమయంలో ఈ వ్యవహారం బయటకు రావటమన్నది మర్చిపోకూడదు.
ఒకవేళ సదరు జర్నలిస్ట్.. ఎంపీ అసద్ లాంటి వాళ్లు ఆరోపిస్తున్నట్లుగా సంజయ్ తన మతం కారణంగా తొందరగా బయటకు వచ్చాడన్నదే నిజమైతే.. అసలు అరెస్టే అవకూడదు కదా! ? ఇక 42 నెలలు జైల్లో ఎందుకు ఉంటాడు? సంజయ్ దత్ ను కాస్త పక్కన పెడదాం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సంగతేంటి? హిట్ అండ్ రన్ కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించారు. మరి.. సల్మాన్ అన్న పేరు కారణంగానే ఆయన అలా బయటపడ్డారని ఎవరైనా ఆరోపిస్తే..?
వీటన్నింటిని పక్కన పెడితే.. ఈ దేశానికి వచ్చిన విదేశీ అతిధిపై భౌతిక దాడి జరిగితే అరెస్ట్ కాకుండా ఉండటం జరుగుతుందా? బంగ్లాదేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై దాడి చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ కాలేదు? అంతదాకా ఎందుకు.. మీడియా కెమేరాల సాక్షిగా తెలంగాణ పీసీసీ చీఫ్ ను కారులో నుంచి గుంజి మరీ దాడికి పాల్పడిన ఉదంతంలో అసద్ ఎందుకు అరెస్ట్ కాలేదు? రాత్రిళ్లు హైదరాబాద్ పాతబస్తీలో సమావేశాలు ఏర్పాటు చేసి.. ఇష్టారాజ్యంగా మాట్లాడే ఓవైసీ బ్రదర్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోనిది.. కేవలం అసదుద్దీన్ అన్న పేరు కారణంగానే అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే?
అంతదాకా ఎందుకు వందలాది మంది ప్రాణాలు తీసిన యూకూబ్ మెమన్ ను ఉరి తీస్తే.. వారికి మద్దుతుగా ఆందోళనలు చేయటం.. వర్సిటీల్లో కార్యక్రమాలు నిర్వహించటం.. ఉగ్రవాది అయిన అఫ్జల్ గురు లాంటి వాడ్ని హీరోగా పొగుడుతూ వర్థంతులు నిర్వహించటం.. కేవలం ‘ఆ’ వర్గానికి చెందిన వారు కాబట్టే కానీ.. అదే ఏ పుల్లారావో.. ఎల్లారావో అయితే ఇలాంటి పరిస్థితే ఉంటుందా? అని ప్రశ్నిస్తే..? అవసరం ఉన్నా లేకున్నా ఈకలు పీకటం అలవాటు చేసుకున్న అసద్.. కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈ దేశంలో మతం ఆధారంగా పక్షపాత నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉంటే.. తను గొంతు విప్పే అవకాశమే ఉండదన్న విషయాన్ని అసదుద్దీన్ మర్చిపోకూడదు. ప్రపంచంలో అత్యధికంగా హిందువులున్న దేశంలో ఇతర మతాల వ్యక్తులు హాయిగా అన్ని హక్కులు కొన్ని సార్లు ఎక్కువ సదుపాయాలతో నివసిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియా మాత్రమే!