మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని జాగ్రత్తగా గమనించారా? మీడియాతో ఆయన మాట్లాడే సమయంలో కానీ.. ప్రజలతో మాట్లాడే టైంలోనూ ఆయన యమా సీరియస్ గా ఉంటారు.ఎక్కడా జోకులు వేయటం.. నవ్వుతూ ఉండటం కనిపించదు. హాట్ హాట్ వ్యాఖ్యలు చేసే అసద్.. ఎప్పుడూ గంభీరంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఇక.. తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే సమయంలో ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు తూటాల్ని తలపిస్తుంటాయి. ఇదంతా ఇప్పటివరకూ మనకు కనిపించిన అసద్. తాజాగా ఒక కార్యక్రమంలో దర్శనమిచ్చిన అసద్.. తనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించారు. తన రాజకీయ ప్రత్యర్థి మాటలకు అసద్ పడీ పడీ నవ్వటం మొదలు.. కార్యక్రమం మొత్తం అసద్ నవ్వులు చిందించిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇంతకీ ఈ సన్నివేశం ఎక్కడ జరిగింది? అసద్ అంతలా ఎందుకు నవ్వారు? లాంటివి తెలుసుకోవాలంటే ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే నిర్వహించిన డిబేట్ కార్యక్రమం గురించి తెలుసుకోవాలి. రాహుల్ కన్వల్ వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ కార్యక్రమం అద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. దేశంలో తనను ఏ విషయంలోనైనా అడ్డుకునే మొనగాడే పుట్టలేదని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించగా.. ఎవ్వరూ లేరా? అంటూ యాంకర్ రెట్టించి అడగటం కనిపించింది. దీంతో వ్యాఖ్యాత అంతరంగం అర్థం చేసుకున్న స్వామి.. బహుశా మీరు రోజూ జైట్లీతో మాట్లాడుతున్నారనుకుంటున్నా అంటూ సమాధానం చెప్పటంతో అసదుద్దీన్ పడీ పడీ నవ్వటం కనిపించింది.
సైద్ధాంతికంగా భిన్న ధ్రువాల్లాంటి అసద్.. స్వామిలు ఇద్దరు పాల్గొన్న ఈ డిబెట్ లో పలు అంశాలపై ఆహ్లాదకర చర్చ సాగింది. పలు సందర్భాల్లో స్వామి మాటలకు అసద్ నవ్వుతూ కనిపించారు. బ్యాలెన్స్ గా కనిపించిన అసద్.. తన తీరుకు భిన్నంగా వ్యవహరించటం పలువురు దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.