మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తన గొంతుకు కత్తి పెట్టినా తన నోటి నుంచి ‘‘భారత్ మాతా కీ జై’’ అన్న మాట రాదంటూ చేసిన వ్యాఖ్యకు వెరైటీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎక్కడైనా కనిపిస్తే.. భారత్ మాతా కీ జై అన్న నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే.. ఇలాంటి నినాదాలుచేసే వారు.. బీజేపీ.. ఆ పార్టీ అనుబంధ సంస్థల కార్యకర్తలు అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు.. వారి అనుబంధ సంస్థలకు చెందిన వారు సైతం పదే పదే భారత్ మాతా కీ జై అంటూ నినదిస్తున్నారు. తాజాగా చర్లపల్లి జైల్లో ఉన్న హెచ్ సీయూ విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలంటూ అసద్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హెచ్ సీయూ వీసీ అతిధి గృహం మీద దాడి చేయటం.. పోలీసులు.. మీడియా మీద దాడులకు తెగబడ్డ వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టుకు హాజరు పర్చటం.. వారికి రిమాండ్ విధించటం తెలిసిందే.
వీరిని పరామర్శించేందుకు వచ్చిన అసద్.. తిరిగి వెళుతున్న సమయంలో.. అక్కడే ఉన్న ఎన్ ఎస్ యూ కార్యకర్తలు పెద్ద ఎత్తున భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం ఇదే తరహా నినాదాలు చేయటం కనిపించింది. చర్లపల్లి జైల్లో ఉన్న విద్యార్థుల్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శకు వచ్చిన సందర్భంగా ఈ సీన్ చోటు చేసుకుంది. అసద్ పట్ల తమకున్న ఆగ్రహాన్ని.. తాజా నినాదంతో చెప్పేస్తుండటం గమనార్హం.